Revanth Reddy : ఓటుకు నోటు కేసులో రేవంత్‌కు చుక్కెదురు

ఓటుకు నోటు కేసులో  మల్కాజ్‌గిరి  ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని రేవంత్ రెడ్డి ధాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హై కోర్టు కోట్టివేసింది.

Ts High Court Dismisses Revanth Reddy Petition Regarding Cash For Vote Case

Revanth Reddy  : ఓటుకు నోటు కేసులో  మల్కాజ్‌గిరి  ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని రేవంత్ రెడ్డి ధాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హై కోర్టు కోట్టివేసింది. ఓటుకు నోటు కేసు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటీషన్ ను విచారిచకుండానే హై కోర్టు కొట్టి వేసింది.

గతంలో రేవంత్ రెడ్డి ఇదే పిటీషన్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసారు. అక్కడ పిటీషన్ కొట్టి వేయటంతో ఆయన హై కోర్టును ఆశ్రయించారు. 2015లో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తూ, అప్పటి టీడీపీ నాయకుడైన రేవంత్ రెడ్డి కెమెరాకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు.

ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. గత ఆరేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతోంది.