హీరో విజయ్ దేవరకొండ పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసిన హైకోర్టు

విజయ్ దేవరకొండ సామాజిక మాధ్యమాల్లో క్షమాపణ కూడా చెప్పాడని హైకోర్టుకు అతడి తరఫు న్యాయవాది తెలిపారు.

గిరిజనలను కించపరిచేలా, వారి ప్రతిష్ఠ దెబ్బ తీసేలా విజయ్ దేవర కొండ వ్యాఖ్యలు చేశాడని గతంలో రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. తనపై నమోదైన కేసు కొట్టేయాలని విజయ్ దేవరకొండ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఆ వ్యాఖ్యలు చేసిన 2 నెలలు తరువాత ఫిర్యాదు చేశారని, ఇందులో దురుద్దేశం ఉందని అన్నారు.

Also Read: మోదీని కలిసిన చిన్నజీయర్ స్వామి, జూపల్లి రామేశ్వరరావు.. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3వ వార్షికోత్సవానికి ఆహ్వానం

విజయ్ దేవరకొండ సామాజిక మాధ్యమాల్లో క్షమాపణ కూడా చెప్పాడని హైకోర్టుకు అతడి తరఫు న్యాయవాది తెలిపారు. సోషల్ మీడియాలో చెప్పిన క్షమాపణను పరిగణనలోకి తీసుకోకూడదని ప్రతివాదుల తరుఫు న్యాయవాదలు వాదనలు వినిపించారు. వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు వాయిదా వేసింది.