మోదీని కలిసిన చిన్నజీయర్ స్వామి, జూపల్లి రామేశ్వరరావు.. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3వ వార్షికోత్సవానికి ఆహ్వానం

ఆధ్యాత్మిక, దైవిక కార్యక్రమాల ద్వారా సమాజంలో భక్తిభావాన్ని పెంపొందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా మైహోమ్‌ గ్రూప్ చైర్మన్ డా.రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావును అభినందించారు.

మోదీని కలిసిన చిన్నజీయర్ స్వామి, జూపల్లి రామేశ్వరరావు.. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3వ వార్షికోత్సవానికి ఆహ్వానం

Updated On : July 31, 2025 / 7:37 PM IST

ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ఆయనను ఇవాళ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోమ్‌ గ్రూప్ చైర్మన్ డా.జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ వైస్ చైర్మన్ రామురావు కలిశారు.

తెలంగాణ, ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది చివరలో నిర్వహించే ముగింపు వేడుకలకు విశిష్ఠ అతిథిగా రావాలని మోదీని ఆహ్వానించారు. మోదీ సానుకూలంగా స్పందించారు.

Also Read: అందుకే ఫిరాయింపుదారులు అనర్హత నుంచి విముక్తి పొందుతున్నారు: సుప్రీంకోర్టు తీర్పుపై యనమల

మోదీకి చినజీయర్ స్వామి హైదరాబాద్ ముచ్చింతల్‌లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం విశేషాలను వివరించారు. సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో ఉన్న 108 దివ్య దేశాలలో కొలువుతీరిన దేవతామూర్తులకు జరిగే నిత్య కైంకర్యాలను ప్రధానికి తెలియజేశారు. 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోన్న నేత్ర విద్యాలయం, ఆయుర్వేద- హోమియో కళాశాల పురోగతి గురించి ప్రధాని ఆసక్తిగా తెలుసుకున్నారు.