TS SSC Exams
TS SSC Exam : తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన తేదీలు ఖరారైనట్లు తెలిసింది. వచ్చే ఏడాది మార్చి 18 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షలను గతానికి భిన్నంగా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. (TS SSC Exams) ఈ క్రమంలో ఈసారి పరీక్షల నిర్వహణలో కీలక మార్పులు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Also Read: AP Rains : ఏపీ వైపు దూసుకొస్తున్న మరో వాయుగుండం.. అత్యంత భారీ వర్షాల అలర్ట్.. వాతావరణ రిపోర్ట్ ఇలా..
గత విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో కొన్ని పరీక్షల మధ్య ఒక్కరోజు కూడా వ్యవధి లేదు. దీంతో ఈసారి పరీక్షల మధ్య వ్యవధి ఉండేలా విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్‌ను రూపొందిస్తున్నట్లు తెలిసింది. సీబీఎస్ఈలో కొన్ని పరీక్షలకు వారం రోజుల వ్యవధి కూడా ఉంటోంది. అదే విధానాన్ని రాష్ట్రంలో పదో తరగతికి అమలు చేస్తే విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఆ దిశగా పాఠశాల విద్యాశాఖ అధికారులు రెండుమూడు రకాల షెడ్యూళ్లను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే టెన్త్ పరీక్షల తేదీల ప్రకటనలో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఒక పరీక్షకు నడుమ మరో పరీక్షకు నడుమ రెండు, మూడు రోజులపాటు వ్యవధి ఇస్తే విద్యార్థులు పరీక్షలకు ఉత్తమంగా సిద్ధమయ్యే అవకాశం ఉంటుందని, తద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చుననే భావనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. పరీక్షలను వరుసగా నిర్వహించడం వల్ల బాగా చదివే విద్యార్థులుసైతం ఫలితాల్లో వెనుకబడి పోతున్నారని, ఇక అంతంతమాత్రంగా చదివే విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోందని అధికారులు చెబుతున్నారు.
అందుకే ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా ఒక పరీక్షకు మరో పరీక్షకు నడుమ కనీసం రెండు రోజుల వ్యవధి ఉండేలా పరీక్షల టైంటేబుల్ రూపొందించి ప్రభుత్వం అనుమతి పొందాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
Also Read: గులాబీ దళపతి వస్తున్నారు? సర్పంచ్ ఎన్నికలను కేసీఆర్ సీరియస్‌గా తీసుకుంటున్నారా?