తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవిగో

అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు కొత్తగా మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని టీఎస్పీఎస్సీ తెలిపింది. 

TSPSC

తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 563 పోస్టులను టీఎస్పీఎస్సీ భర్తీ చేయనుంది. ఈ నెల 23నుంచి మార్చి 14 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసిన గంటల వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసింది టీఎస్పీఎస్సీ. tspsc.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రిలిమ్స్ మే-జూన్‌లో, మెయిన్స్ సెప్టెంబరు-అక్టోబరులో నిర్వహించనున్నారు. ఎంపీడీవోలు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ అప్ జైల్స్, జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్, జిల్లాల పంచాయతీ ఆఫీసర్, జిల్లా రిజిస్ట్రార్, డీఎస్పీల సహా మొత్తం 18 విభాగాల్లో 563 పోస్టులు భర్తీ చేయనున్నారు.

అభ్యర్థుల వయోపరిమితిని కొన్ని రోజుల క్రితమే 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గతంలో రెండుసార్లు గ్రూప్-1 పరీక్ష రద్దయింది. అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు కొత్తగా మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని టీఎస్పీఎస్సీ తెలిపింది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి