TSPSC Paper Leak : టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపింది. క్వశ్చన్ పేపర్ లీక్ దుమారం రేపుతోంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అటు అధికార పార్టీ నేతలు సైతం ఎదురుదాడికి దిగారు.
తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీక్ వెనుక కుట్ర కోణం ఉందన్నారు. ఈ కుట్రను సిట్ బయటకు తీయాలన్నారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్ద వాళ్లున్నా వదిలేది లేదని మంత్రి తేల్చి చెప్పారు. బీజేపీకి యువత దూరం అవుతుందన్న ఉద్దేశంతోనే.. పేపర్ లీక్ జరిగినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు మంత్రి తలసాని.(TSPSC Paper Leak)
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు.. ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని ఆదేశం
”దీని వెనుక కుట్ర కోణం దాగి ఉంది. సిట్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా. దీని వెనుక ఎవరున్నా బయటకు తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దు. యువకుల జీవితాలతో ఆడుకునే వ్యవస్థలు ఉండటం, దుర్మార్గమైన చర్య. పేపర్ లీక్ వెనుక ఉన్న వాళ్లు ఎంత పెద్ద వాళ్లైనా, వాళ్లు ఎవరైనా వదిలిపెట్టొద్దు అని సంబంధిత అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నాం. యువత జీవితాలతో ఆడుకుంటే వారిని వదిలి పెట్టే పరిస్థిలి లేదు. వరుసగా ఉద్యోగ రిక్రూట్ మెంట్లు జరిగితే.. బీజేపీకి యువత దూరం అవుతుందని, పలు సందర్భాల్లో బీజేపీ నేతలే స్వయంగా చెప్పారు” అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Also Read..Dasoju Sravan: బండి సంజయ్ నేతృత్వంలోనే టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్.. దాసోజు శ్రవణ్ ఆరోపణ
మరోవైపు టీఎస్ పీఎస్ సీ సంచలన నిర్ణయం తీసుకుంది. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పరీక్షను రద్దు చేసింది. ఏఈ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు నిర్ధారణ కావడంతో కమిషన్ ఈ మేరకు డెసిషన్ తీసుకుంది. ఈ నెల 5న ఏఈ పరీక్ష జరిగింది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీని ప్రకటిస్తామని TSPSC తెలిపింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) లో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కమిషన్ ఉద్యోగి ప్రవీణ్ కుమార్ ప్రధాన నిందితుడు. ప్రవీణ్ తో పాటు తొమ్మిది మందిని ఈ కేసులో పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు ప్రవీణ్ గతేడాది జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కూడా రాశాడు. పరీక్షలో 103 మార్కులు వచ్చినా ప్రవీణ్ మెయిన్స్ కు అర్హత సాధించలేదు.(TSPSC Paper Leak)
అధికారులు ప్రవీణ్ జవాబుపత్రాన్ని పరిశీలించగా.. ఓఎంఆర్ షీట్ లో రాంగ్ బబ్లింగ్ చేసినట్లు బయటపడింది. దీని వల్లే ప్రవీణ్ మెయిన్స్ కు అర్హత సాధించలేదని తేలింది. అయితే, ప్రిలిమ్స్ లో అన్ని మార్కులు సాధించేంత ప్రతిభ ప్రవీణ్ కు ఉందా.. ఆ పేపర్ కూడా లీక్ చేశాడా? అనే సందేహంతో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ కారణంగానే.. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ కూడా లీక్ అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షపత్రం లీక్ చేసిన కమిషన్ సెక్రటరీ పీఏ ప్రవీణ్ మరిన్ని అక్రమాలకు పాల్పడి ఉంటాడనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఏఈ పరీక్ష పత్రం పేపర్ లీక్ వ్యవహారంలో ప్రవీణ్ తో పాటు మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ ఫోన్ ను పరిశీలించగా.. అందులో చాలామంది మహిళలకు సంబంధించిన నగ్న చిత్రాలు, అసభ్య చాటింగ్ వివరాలు బయటపడ్డాయి.