TSPSC Paper Leak : AE పరీక్ష రద్దు? రేపు తుది నిర్ణయం చెబుతామన్న TSPSC ఛైర్మన్

రాజశేఖర్ రెడ్డి నెట్ వర్క్ ఎక్స్ పర్ట్.. 6, 7 ఏళ్లుగా ఇక్కడ పని చేస్తున్నారు. అతనికి అన్ని IP అడ్రస్ లు తెలుసు. విచారణలో ఇతని ద్వారా హక్ అయ్యిందని తెలుసుకున్నాము. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ద్వారా లీక్ చేయించినట్లుగా తెలుసుకున్నాము. కొందరు వ్యక్తులకు వీరు సమాచారాన్ని చేరవేశారు.

TSPSC Paper Leak : AE పరీక్ష రద్దు? రేపు తుది నిర్ణయం చెబుతామన్న TSPSC ఛైర్మన్

Updated On : March 14, 2023 / 9:44 PM IST

TSPSC Paper Leak : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఓ అమ్మాయి కోసం కమిషన్ ఉద్యోగి క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం దుమారం రేపింది. టీఎస్ పీఎస్సీ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఏకంగా కమిషన్ ను రద్దు చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో TSPSC ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు.

”దురదృష్టకరమైన వాతావరణంలో కలవాల్సి వచ్చింది. 30లక్షల మంది అభ్యర్థులు OTR దరఖాస్తు చేసుకున్నారు. UGC ఛైర్మన్ విజిట్ సమయంలో కూడా OTR ని ప్రశంసించారు. ఫేస్ లెస్ గా ఈ సిస్టమ్ ఉందన్నారు.

TSPSCలో దాదాపుగా 2వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రతి ఏటా 4వేలకు పైగా నియామకాలు చేపడుతున్నాం. ఈ ఏడాది దాదాపుగా 23వేలకు పైగా నియామకాలు చేపట్టాం. 26 నోటిఫికేషన్లు విడుదల చేశాం. చాలా ఎక్కువ వర్క్ లోడ్ ఉంది. ఈ ఏడేళ్లలో 30వేలకు పైగా నియామకాలు చేపట్టాము.

Also Read..TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ లీక్ కేసులో నిందితుల రిమాండ్.. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు యువతులతో సంబంధాలు

గ్రూప్-వన్ ఏప్రిల్ లో నోటిఫికేషన్ ఇచ్చాము. అక్టోబర్ లో పరీక్ష నిర్వహించాము. గ్రూప్ వన్ విషయంలో మాస్ కాపింగ్ అవకాశం లేకుండా మల్టీ క్వశన్స్, ఆన్సర్ లో కూడా జంబ్లింగ్ విధానం అమలు చేశాము. ప్రిలిమినరీ పరీక్ష ముగిశాక మెయిన్స్ కి కూడా 1:50 రేషియాలో.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికంగా పిలిచాము.

OMR sheet కూడా స్కాన్ చేసి వెబ్ సైట్ లో పెట్టాం. దాంతో పాటు ప్రిలిమినరీ కీ కూడా పెడతాము. మెయిన్స్ కి ప్రిలిమ్స్ మార్కులు యాడ్ అవ్వవు కాబట్టి కటాఫ్ మార్క్స్ పెట్టము. యుజీసీ ఛైర్మన్ వచ్చినప్పుడు ఆయన కూడా పరీక్ష విధానంపై ఆరా తీశారు.

Also Read..TSPSC Paper Leak : TSPSC ప్రశ్నాపత్రాలు, గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీక్ .. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఘాటు విమర్శలు

175 పోస్టులకు టౌన్ ప్లానింగ్ విభాగంలో ప్రకటన ఇచ్చాము. రాజశేఖర్ రెడ్డి నెట్ వర్క్ ఎక్స్ పర్ట్. 6, 7 ఏళ్లుగా ఇక్కడ పని చేస్తున్నాడు. అతనికి అన్ని IP అడ్రస్ లు తెలుసు. విచారణలో అతని ద్వారా హ్యాక్ అయ్యిందని తెలుసుకున్నాము. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ ద్వారా లీక్ చేయించినట్లుగా తెలుసుకున్నాము. కొందరు వ్యక్తులకు వీరు సమాచారాన్ని చేరవేశారు. AE పరీక్షను రద్దు చెయ్యాలా? వద్దా? అని ఇప్పటివరకు చర్చించాము. వదంతులకు తావు ఇవ్వొద్దని ఈ ప్రెస్ మీట్ పెట్టాం. నా కూతురు గ్రూప్ వన్ రాస్తాను అంటే నేను వద్దని చెప్పా. ఒకవేళ ఆమె గ్రూప్ వన్ రాస్తానంటే నేను ఛైర్మన్ పదవిని వదులుకుంటానని చెప్పా. ఇది ఒక బాధ్యతగా స్వీకరించాను.

Also Read..TSPSC Paper Leak : ఆ యువతి కోసమే.. TSPSC పేపర్‌ లీక్‌ వ్యవహారంలో సంచలన ట్విస్ట్‌

దేశంలో ఉన్న బెస్ట్ రిఫార్మ్స్ ఇక్కడ అమలు చేసే ప్రయత్నం చేశాము. ఇంటి దొంగలు కాబట్టి కొంత తెలుసుకోవడంలో ఇబ్బంది అయ్యింది. AE పరీక్ష పైన రేపు ఫైనల్ నిర్ణయం తీసుకుంటాము. గ్రూప్ వన్ OMR షీట్ కనిపిస్తుంది. అది వెబ్ సైట్ లోనే ఉంటుంది. ప్రవీణ్ కి 103 మార్కులు రావడం నిజమే. కానీ అదే టాప్ మార్క్ కాదు” అని TSPSC ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి చెప్పారు.