TSPSC Question Paper Leak : టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ.. 77కు చేరిన అరెస్టుల సంఖ్య

తాజాగా అరెస్టు అయిన 13 మంది నిందితులను సిట్ బృందం కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన కొంతమంది ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నట్టు సిట్ గుర్తించింది.

TSPSC Question Paper Leak

SIT Investigation : టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా మరో 13 మంది నిందితులు అరెస్టు అయ్యారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టుల సంఖ్య 77కు చేరింది. నిందితుడు పోల రమేష్..అసిస్టెంట్ ఇంజనీర్ ప్రశ్నాపత్రాన్ని 30 మందికి విక్రయించినట్టుగా గుర్తించారు.

పోల రమేష్ ఇచ్చిన సమాచారంతో మరో 13 మందిని అరెస్టు చేశారు. ఐదు ప్రత్యేక బృందాలతో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఒక్కో నిందితుడిని విచారిస్తే కొత్త పేర్లు బయట పడుతున్నాయి. చైన్ సిస్టం మాదిరి ప్రశ్నాపత్రాలు అమ్మినట్టు సిట్ గుర్తించారు.

Muthireddy Yadagiri Reddy : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అల్లుడు, కూతురుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

తాజాగా అరెస్టు అయిన 13 మంది నిందితులను సిట్ బృందం కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన కొంతమంది ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నట్టు సిట్ గుర్తించింది. ఈ కేసులో అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు