Muthireddy Yadagiri Reddy : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అల్లుడు, కూతురుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

ప్రజా సేవలో తన విధులకు కూతురు తుల్జాభవానిరెడ్డి, అల్లుడు రాహుల్ రెడ్డి ఆటంకం కల్గిస్తున్నారని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Muthireddy Yadagiri Reddy : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అల్లుడు, కూతురుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

non-bailable case

Updated On : July 11, 2023 / 1:49 PM IST

Non-Bailable Case Registered  : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంటి పంచాయితీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. డాటర్ వర్సెస్ ఫాదర్ వ్యవహారంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురు తుల్జాభవానిరెడ్డికి షాక్ తగిలింది. ప్రజా సేవలో తన విధులకు కూతురు తుల్జాభవానిరెడ్డి, అల్లుడు రాహుల్ రెడ్డి ఆటంకం కల్గిస్తున్నారని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఫిర్యాదు మేరకు ఆయన అల్లుడు, కూతురుపై పోలీసులు నాన్ బెయిలబుల్ కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 186, 505 కింద కేసు నమోదు చేశారు. జులై 1న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామ పోలీసులను ఆశ్రయించారు.

Telangana Rains : తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

ఇదే వ్యవహారంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యక్తిగత వ్యవహారాలకు అడ్డు తగలకుండా చూడాలని డీజీపీ సహా స్ధానిక పోలీసు అధికారులను హైకోర్టు ఆదేశించింది.