Group-4 Exam
Group-4 Exam Hall Tickets : గ్రూప్ – 4 రాత పరీక్ష జులై 1న నిర్వహించనున్నారు. రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. హాల్ టికెట్లను అధికారులు టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో ఉంచారు. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందు వరకు హాల్ టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నారు.
జులై1న రెండు సెషన్లలో గ్రూప్ -4 రాత పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి రెండు గంటల ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు.
Bank Holidays : జులైలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసా?
ఉదయం, మధ్యాహ్నం సెషన్లకు 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లను మూసివేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు షూ ధరించి రాకూడదని అధికారులు పేర్కొన్నారు. కేవలం చెప్పులు మాత్రమే ధరించి రావాలని ఆదేశించారు.