HiTech Bus Stand: తెలంగాణలో హైటెక్ బస్టాండ్లు.. షాపింగ్ మాల్స్, ప్లే జోన్స్.. TGSRTC సంచలన నిర్ణయం
ఇకపై బస్టాండ్ అంటే కేవలం బస్సు కోసం వేచి చూసే ఇరుకు ప్రదేశం మాత్రమే కాకుండా, షాపింగ్, వినోదాలకు కేరాఫ్ (HiTech Bus Stand)అడ్రస్‌గా మార్చబోతోంది.
- V Santhosh Kumar
- Published on- September 16, 2026 / 06:31 PM IST
TSRTC is set to construct 13 modern bus station at the corporate level.
- ఆర్టీసీ నుంచి గుడ్ న్యూస్
- 13 ప్రాంతాల్లో హైటెక్ బస్టాండ్లు
- షాపింగ్, వినోదం ఒకేచోట
HiTech Bus Stand: తెలంగాణలో ప్రజారవాణా వ్యవస్థను ఆధునీకరించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (HiTech Bus Stand) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బస్టాండ్ అంటే కేవలం బస్సు కోసం వేచి చూసే ఇరుకు ప్రదేశం మాత్రమే కాకుండా, షాపింగ్, వినోదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చబోతోంది. తెలంగాణ ప్రభుత్వం, టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి వినూత్న ఆలోచనతో రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాల్లో ఎయిర్‌పోర్ట్, కార్పొరేట్ స్థాయి హంగులతో మోడల్ బస్టాండ్లను నిర్మించేందుకు రవాణా శాఖ నుంచి అధికారిక ఆమోదం లభించింది.
మల్టీప్లెక్స్ హంగులు.. మల్టీ మోడల్ కనెక్టివిటీ:
నూతనంగా అందుబాటులోకి రానున్న ఈ హైటెక్ బస్ స్టేషన్లలో ప్రయాణికుల కోసం మల్టీ-మోడల్ కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల బస్సు దిగిన వెంటనే రైల్వే స్టేషన్లు లేదా ఇతర రవాణా సాధనాలను సులభంగా చేరుకోవచ్చు. అంతేకాకుండా కమర్షియల్ బిజినెస్ కాంప్లెక్స్‌లు, మల్టీప్లెక్స్ రేంజ్ ఫుడ్ కోర్టులు, పిల్లల గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లను అందుబాటులోకి తేనున్నారు. బిజినెస్ విస్తరణ కోసం వ్యాపారులు ఈ కాంప్లెక్స్‌లలో షాపులను కేటాయించుకోవచ్చని ఆర్టీసీ ప్రకటించింది.
రాష్ట్రంలో 13 ప్రాంతాల ఎంపిక:
తొలివిడతగా నాగర్‌కర్నూల్, రేగొండ, హుజూర్ నగర్, కోదాడ, కొడంగల్, కోస్గి, మద్దూరు, కేసముద్రం, హుస్నాబాద్, ములుగు, మధిర, నల్గొండ, కొత్తగూడెం ప్రాంతాల్లో ఈ మోడల్ బస్టాండ్లను నిర్మించనున్నారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టుతో తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరింత నాణ్యమైన, ఆధునిక సేవలను అందించనుంది.
