RTC Offer: బాలలకు బంపర్ ఆఫర్.. ఆర్టీసీలో ఎక్కడికైనా ఫ్రీ!

బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పదిహేనేళ్లలోపు పిల్లలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

RTC Offer: బాలలకు బంపర్ ఆఫర్.. ఆర్టీసీలో ఎక్కడికైనా ఫ్రీ!

Tsrtc

Updated On : November 14, 2021 / 1:00 PM IST

RTC Offer: బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పదిహేనేళ్లలోపు పిల్లలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈరోజు ఆర్టీసీకి చెందిన ఏసీ బస్సులు, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, డీలక్స్ అన్నీ బస్సుల్లోనూ పిల్లలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు ప్రకటించింది.

ఏ బస్సులో ప్రయాణించినా టికెట్ తీసుకోవాల్సిన అవసరంలేదని ఉచిత ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ప్రకటించారు. సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలంటూ.. బాలలదినోత్సవం సందర్బంగా బాలబాలికలకు శుభాకాంక్షలు తెలియజేశారు సజ్జనార్.

ఈరోజు ఒక్కరోజు ఏ బస్సులోనూ చిన్నారులకు టికెట్ అవసరం ఉండదని ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. దీనికి సంబంధించి సజ్జనార్ ట్వీట్ చేశారు. ఇప్పటికే బస్సు ఎక్కి పలు ప్రాంతాలకు వెళ్తున్నవారి నుంచి టిక్కెట్లు తీసుకోలేదు కండెక్టర్లు. పలువురు చిన్నారులు ఈ విషయాన్ని ట్వీట్ల ద్వారా సజ్జనార్‍‌తో పంచుకున్నారు.