×
Ad

TGSRTC: గూగుల్‌ మ్యాప్స్‌లో మీరు ఎక్కిన బస్సు కదలికలు.. మీ అర చేతుల్లోనే ఈ సమాచారం అంతా…

గూగుల్‌ మ్యాప్స్‌ సాయంతో ఈ సేవలను పూర్తి స్థాయిలో కచ్చితత్వంతో తీసుకురావాలని టీజీఎస్‌ఆర్టీసీ భావిస్తోంది.

TGSRTC

TGSRTC: ప్రయాణికులు బస్సు ఎక్కాక వారు దిగాల్సిన స్టాప్‌కు ఎంత దూరంలో ఉన్నామన్న సమాచారం తెలుసుకునే సౌకర్యం ఉంటే ఎలా ఉంటుంది? అలాగే, క్యూఆర్‌ బేస్డ్‌ డిజిటల్‌ బస్సు పాస్‌, బస్సు టికెట్ల డీటైల్స్ వారి స్మార్ట్‌ఫోన్‌లోనే చూసుకుంటే ఎలా ఉంటుంది?

ఈ సదుపాయాలే అందుబాటులోకి తీసుకువచ్చేలా టీజీఎస్‌ఆర్టీసీ గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా ఈ సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే గమ్యం పేరిట యాప్‌ ఓ యాప్‌ ఉంది.

Also Read: గొడవ పడ్డ పిల్లలు.. కొట్లాట పెద్దల వరకు వెళ్లి ఒకరి మృతి.. ఏం జరిగిందంటే?

అందులో బస్సు బయలు దేరిన సమయంతో పాటు అది ఏ మార్గంలో, ఎక్కడుందన్న వివరాలు వస్తున్నాయి. అయితే, ఆ యాప్‌లో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో గూగుల్‌ మ్యాప్స్‌ సాయంతో ఈ సేవలను పూర్తి స్థాయిలో కచ్చితత్వంతో తీసుకురావాలని టీజీఎస్‌ఆర్టీసీ భావిస్తోంది.

త్వరలోనే ఆర్టీసీ బస్సుల డేటాను గూగుల్‌కు అధికారులు అందించనున్నారు. మరో రెండువారాల్లో హైదరాబాద్‌ సిటీ బస్సుల సమాచారాన్ని ప్రయాణికులు తెలుసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత తెలంగాణలోని మిగతా బస్సుల సమాచారం కూడా గూగుల్‌ మ్యాప్స్‌లో తెలుసుకోవచ్చు.