గొడవ పడ్డ పిల్లలు.. కొట్లాట పెద్దల వరకు వెళ్లి ఒకరి మృతి.. ఏం జరిగిందంటే?

సయ్యద్ ఆమిర్, సయ్యద్ అలీ ఘర్షణకు దిగడంతో వారిని స్థానికులు విడిపించారు.

గొడవ పడ్డ పిల్లలు.. కొట్లాట పెద్దల వరకు వెళ్లి ఒకరి మృతి.. ఏం జరిగిందంటే?

Updated On : October 7, 2025 / 7:38 AM IST

Medchal Malkajgiri: పిల్లలు గొడవపడడంతో పెద్దలు ఇన్వాల్వ్‌ అయ్యారు. దీంతో ఓ పిల్లాడి తండ్రికి గాయాలై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఘట్‌కేసర్‌లో చోటుచేసుకుంది.

సయ్యద్ ఆమిర్, సయ్యద్ అలీ కుటుంబాలు ఔషపూర్‌లో నివాసం ఉంటున్నాయి. వారి ఇళ్లు ఎదురెదురుగానే ఉండడంతో ఆ ఇరు కుటుంబాల పిల్లల మధ్య స్నేహం ఏర్పడింది. అయితే, ఆమిర్‌కి హసీనా, అంజద్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సయ్యద్ అలీ కొడుకు పేరు అబూ.

Also Read: సుప్రీంకోర్టులో కలకలం.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్‌ గవాయ్‌ వైపు షూ విసిరిన అడ్వకేట్.. దాడికి యత్నం

వారు ముగ్గురు గొడవపడ్డారు. దీంతో సయ్యద్ ఆమిర్ జోక్యం చేసుకుని పిల్లలను మందలించాడు. అయితే, అబూ వెళ్లి ఈ విషయాన్ని తన తండ్రి సయ్యద్ అలీకి చెప్పాడు. ఆగ్రహంతో బటయకు దూసుకొచ్చాడు ఆమిర్.

సయ్యద్ ఆమిర్, సయ్యద్ అలీ ఘర్షణకు దిగడంతో వారిని స్థానికులు విడిపించారు. అరగంట అనంతరం సయ్యద్ ఆమిర్‌ ఛాతి నొప్పి, వాంతులతో బాధపడుతూ స్పృహ కోల్పోయాడు. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు మృతి చెందాడు.

నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్థులతో కలిసి బాధితుడి కుటుంబ సభ్యులువరంగల్ హైవేపై ఆందోళనకు దిగారు. కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు బలవంతంగా పంపించేశారు.