×
Ad

TSRTC Buses Sabarimala : అయ్యప్ప భక్తులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. శబరిమలకు రాయితీపై ప్రత్యేక బస్సులు

అయ్యప్ప స్వామి భక్తులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. శబరిమలకు రాయితీపై ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల వెళ్లి రావడం ఆనవాయితీ.

  • Published On : December 10, 2022 / 06:05 PM IST

TSRTC bus Sabarimala

TSRTC Buses Sabarimala : అయ్యప్ప స్వామి భక్తులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. శబరిమలకు రాయితీపై ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల వెళ్లి రావడం ఆనవాయితీ. అయ్యప్ప స్వామి భక్తులు ప్రవేట్ సంస్థలను ఆశ్రయించి నష్టపోకుండా రాయితీపై ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ ప్రకటించారు.

అనుభవజ్ఞులైన డ్రైవర్లతో కూడిన బస్సుల్లో సురక్షితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపింది.
ఎలాంటి డిపాజిట్ లేకుండా 10 శాతం రాయితీపై సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇద్దరు గురుస్వాములు, ఇద్దరు వంట వారు, 12 సంవత్సరాలు లోబడిన మణికంఠ స్వాములు, ఒక అటెండర్ కు ఉచితంగా ప్రయాణం కల్సిస్తామని ప్రకటించారు. శబరిమల యాత్ర బస్సును బుకింగ్ చేసిన గురుస్వామికి కూడా ప్రయాణి ఉచితమన్నారు.

TSRTC: సంక్రాంతికి సొంతూళ్ల‌కు వెళ్లే ప్ర‌యాణీకుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ

ఈ ప్రత్యేక బస్సులను అయ్యప్ప స్వాములు కోరుకున్న ప్రదేశం నుంచి దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రాల వరకు నడుపబడును. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు సీట్ రిజర్వేషన్ కొరకు, శబరిమల యాత్రకు కావాల్సిన ఆర్టీసీ బస్ అద్దె బుకింగ్ ల కొరకు www.tsrtconline.in సంప్రదించాలని సూచించారు. సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కొరకు కాల్ సెంటర్ 040 23450033, 69440000 నెంబర్లను సంప్రదించవచ్చు.