TSRTC: సంక్రాంతికి సొంతూళ్ల‌కు వెళ్లే ప్ర‌యాణీకుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ

సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7 నుంచి 15వ తేదీ వ‌ర‌కు ప్ర‌యాణీకులకోసం 4,233 స్పెష‌ల్ బ‌స్సు స‌ర్వీసులు న‌డ‌పాల‌ని టీఎస్ ఆర్టీసీ నిర్ణ‌యించింది. వీటిలో 585 బ‌స్సు స‌ర్వీసుల‌కు ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ల సౌక‌ర్యం క‌ల్పించారు.

TSRTC: సంక్రాంతికి  సొంతూళ్ల‌కు వెళ్లే ప్ర‌యాణీకుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ

TSRTC BUS

TSRTC: స‌ంక్రాంతి పండుగ వ‌చ్చిందంటే న‌గ‌ర వాసులు ప‌ల్లెబాట ప‌డ‌తారు. విద్యాసంస్థ‌ల‌కుసైతం సెల‌వులు రావ‌టంతో ఇంటిల్లిపాది త‌మ సొంత‌గ్రామాల‌కు క్యూక‌డ‌తారు. ఈ క్ర‌మంలో ఆర్టీసీ బ‌స్సులు ప్ర‌తీయేటా సంక్రాంతి స‌మ‌యంలో కిక్కిరిసిపోతాయి. బ‌స్సులు దొర‌క్క ప్రైవేట్ వాహ‌నాల‌ను అధిక‌మంది ఆశ్ర‌యిస్తూ ఇబ్బందులు ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలో ఆ ఇబ్బందుల‌ను తొల‌గించే టీఎస్ ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌తంతో పోలిస్తే వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సొంత గ్రామాల‌కు వెళ్లే న‌గ‌ర వాసుల‌కు 10శాతం అద‌న‌పు బ‌స్సుల‌ను న‌డిపేందుకు సిద్ధ‌మైంది. ఈ విష‌యాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ తెలిపారు.

VC Sajjanar: రోడ్డు ప్రమాదం నుంచి క్షణాల్లో తప్పించుకున్న మహిళ.. వీడియో షేర్ చేసిన వీసీ సజ్జనార్

ఎండీ వీసీ స‌జ్జ‌నార్ అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. గ‌త ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10శాతం అద‌న‌పు బ‌స్సులు న‌డుపుతున్న‌ట్లు త‌లిపారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7 నుంచి 15వ తేదీ వ‌ర‌కు ప్ర‌యాణీకుల కోసం 4,233 స్పెష‌ల్ బ‌స్సు స‌ర్వీసులు న‌డ‌పాల‌ని నిర్ణ‌యించారు. వీటిలో 585 బ‌స్సు స‌ర్వీసుల‌కు ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ల సౌక‌ర్యం క‌ల్పించారు.

మొత్తం 4,233 బస్సులకు గానూ అమలాపురంకు 125, కాకినాడకు 117, కందుకూరుకు 83, విశాఖపట్నంకు 65, పోలవరానికి 51, రాజమండ్రికి 40 ప్రత్యేక బస్సులు న‌డిపేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్ధ‌మ‌వుతోంది. మరోవైపు ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్స్‌డ్ టికెట్ బుకింగ్‌ను 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచామని, వచ్చే ఏడాది జూన్‌ వరకు అందుబాటులో ఉంటుందని టీఎస్‌ఆర్టీసీ తెలిపింది.