Hyderabad: హైదరాబాద్‌లో ప్రారంభమైన శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు.. నేటి నుంచి ఐదు రోజులపాటు ఘనంగా వేడుకలు

హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన శ్రీవారి నమూనా ఆలయంలో ఈ సేవలు కొనసాగుతాయి. భక్తులందరికీ ఆహ్వానం ఉంది.

Hyderabad: హైదరాబాద్ మహా నగరంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల ఆలయంలో స్వామివారికి రోజువారీ నిర్వహించే అన్ని రకాల సేవలను భక్తులకు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఈ వైభవోత్సవాలు నిర్వహిస్తున్నారు.

Viral Video: నడిరోడ్డుపై బైక్‌కు అంటుకున్న నిప్పు.. ఎంతమంది కలిసి ఆర్పేశారో.. వీడియో వైరల్

టీటీడీ ఆధ్వర్యంలోనే, స్థానిక దాతల సహకారంతో ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఈ సేవలు నిర్వహిస్తారు. ఉదయం ఆరు గంటలకు సుప్రభాతంతో మొదలైన సేవలు, రాత్రి ఎనిమిదిన్నర గంటలకు స్వామి వారి ఏకాంత సేవతో ముగుస్తాయి. ఈ ఉత్సవాల్లో ఉదయం ఆరు గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, ఆరున్నర గంటల నుంచి ఏడున్నర గంటల వరకు తోమాల సేవ, కొలువు ఉంటాయి. సాయంత్రం పూట కూడా ఈ తోమాల సేవ ఉంటుంది. ఉదయం ఏడున్నర గంటల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు స్వామి వారికి అర్చన నిర్వహిస్తారు. ఆ తర్వాత నివేదన, శాత్తుమొర ఎనిమిదిన్నర గంటల వరకు కొనసాగుతుంది.

Traffic Light: హార్ట్ షేపులో ట్రాఫిక్ రెడ్ లైట్.. బెంగళూరులో మారిన లైట్లు.. ఎందుకు మార్చారో తెలుసా?

అలాగే శ్రీవారి అష్టాదళ పాదపద్మారాధన, వసంతోత్సవం కూడా నిర్వహిస్తారు. మంగళవారం ఉయదం పది నుంచి పదకొండు గంటల వరకు వసంతోత్సవం వైభవంగా జరిగింది. వీటితోపాటు స్వామివారికి సంబంధించి అన్నమయ్య సంకీర్తనలు ఉంటాయి. ఈ నెల 15 వరకు ఈ వేడుకలు జరుగుతాయి.