శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్‌బీసీ) సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల ఆచూకీ కోసం అధికారులు శ్రమిస్తున్నారు. ఎస్‌ఎల్‌బీసీలో చిక్కుకున్నవారిని గుర్తించడాని క్యాడవర్ డాగ్స్‌ను రప్పిస్తున్నారు.
కేరళ నుంచి ప్రత్యేకంగా క్యాడవర్ డాగ్స్‌లను తీసుకువస్తున్నారని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ అన్నారు. ఐఐటీ నిపుణుల బృందంతో టన్నెల్‌లోకి సింగరేణి, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వెళ్లాయి.
Also Read: అనతి కాలంలోనే 200 సేవలు అందించే అద్భుతమైన మైలురాయిని సాధించాం: నారా లోకేశ్
పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సహాయక బృందాలకు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ దిశా నిర్దేశం చేస్తున్నారు. ఒక చివర నుంచి మట్టిని తీసి ఎక్సలెటర్ పై వేస్తూ నీటిని మరో వైపు దారి మళ్లీస్తూ ముందుకు సాగాలని సూచించారు.
టన్నెల్ లోపల పనిచేసేవారికి కావలసిన సదుపాయాలు ఏర్పాట్లు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ పర్యవేక్షణలో ఆపరేషన్ కొనసాగుతోంది.
ఎస్ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి దాదాపు రెండు వారాలు అవుతున్న విషయం తెలిసిందే. అందులో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదు. సిబ్బంది ఎంతగా శ్రమిస్తున్నా పురోగతి కనిపడడం లేదు.