Nara Lokesh: తక్కువ సమయంలోనే 200 సేవలు అందించే అద్భుతమైన మైలురాయిని సాధించాం: నారా లోకేశ్
సర్కారు ఏదైనా సమాచారాన్ని అందించాలనుకుంటే ఈ వాట్సప్ ద్వారా మెజేజులు పంపుతుంది.

మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ సేవలు 200కు పెంచామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ ఏడాది జనవరిలో 161 సేవలతో ప్రారంభించిన మనమిత్ర తక్కువ సమయంలోనే 200 సేవలు అందించే అద్భుతమైన మైలురాయి సాధించిందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ గవర్నెన్స్ శక్తికి ఇదో నిదర్శనమని తెలిపారు. ప్రజా సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం, సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా, ప్రజలకు సౌలభ్యం, పారదర్శకతను పెంచుతుందని చెప్పారు.
సామాన్యుల ప్రయోజనం కోసం ఈ పౌర-కేంద్రీకృత సేవలను తాము విస్తరిస్తూనే ఉంటామని అన్నారు. మన మిత్ర కోసం 9552300009 కు సందేశం పంపాలని చెప్పారు. మరిన్ని వివరాలను త్వరలోనే తెలుపుతామని అన్నారు.
కాగా, మొదట 161 రకాల పౌర సేవలను అందించిన ప్రభుత్వం ఇప్పుడు 200కు పెంచింది . ఇప్పటికే దేవాదాయతో పాటు ఇంధన, ఏపీఎస్‌ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ సహా పలు శాఖల్లో ఈ సర్వీసులు అందుతున్నాయి. పలు రకాల సర్టిఫికెట్ల కోసం పౌరులు సర్కారు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండాపోతోంది.
సర్కారు ఏదైనా సమాచారాన్ని అందించాలనుకుంటే ఈ వాట్సప్ ద్వారా మెజేజులు పంపుతుంది. ఈ మెసేజులు కోట్ల మందికి ఒకేసారి చేరతాయి. వినతులతో పాటు ఫిర్యాదులు చేయాలనుకుంటే వాట్సప్ నంబర్‌కు మెసేజ్ చేస్తే ఒక లింక్ వస్తుంది. అందులో వివరాలు నమోదు చేయాలి.