యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. పూర్ణచందర్‌ను అరెస్టు చేసిన పోలీసులు..

యాంకర్ స్వేచ్ఛ మృతికేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణ చందర్‌ను ..

Poornachander with anchor Swecha

Anchor swechas Death Case: యాంకర్ స్వేచ్ఛ మృతికేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణ చందర్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి అడ్వకేట్‌తో కలిసి పూర్ణ చందర్ చిక్కడపల్లి పీఎస్‌లో లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Also Read: Anchor Swetcha Votarkar: యాంకర్ స్వేచ్ఛ బలవన్మరణం.. ఆ ఆరోపణలను ఖండించిన పూర్ణచందర్.. మీడియాకు లేఖ

యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. జవహర్ నగర్‌లోని తన నివాసంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అయితే, స్వేచ్ఛ మృతికి పూర్ణచందర్ కారణమని ఆమె తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో పోలీసులు అతనిపై 69బీఎన్ఎస్, 108 బీఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

స్వేచ్ఛతోపాటు తననుకూడా పూర్ణచందర్ ఇబ్బంది పెట్టాడని ఆమె కుమార్తె పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో అతనిపై ఫోక్సో కేసు కూడా పోలీసులు నమోదు చేశారు. గత కొన్నాళ్ల నుంచి పూర్ణచందర్‌తో స్వేచ్ఛ సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో స్వేచ్ఛను వివాహం చేసుకోకుండా వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పూర్ణచందర్ వేధింపులు భరించలేక స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: తెలుగు యాంకర్ స్వేచ్ఛ మృతికి కారణం పూర్ణచందరే అంటూ ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు.. పోస్టుమార్టం పూర్తి..