తెలుగు యాంకర్ స్వేచ్ఛ మృతికి కారణం పూర్ణచందరే అంటూ ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు.. పోస్టుమార్టం పూర్తి..

స్వేచ్ఛ నేత్రాలను ఆమె తల్లిదండ్రులు డొనేట్‌ చేయడానికి ఒప్పుకున్నారు.

తెలుగు యాంకర్ స్వేచ్ఛ మృతికి కారణం పూర్ణచందరే అంటూ ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు.. పోస్టుమార్టం పూర్తి..

Telugu Anchor Swetcha

Updated On : June 28, 2025 / 1:04 PM IST

తెలుగు యాంకర్ స్వేచ్ఛ మృతిపై ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛ మృతిపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. తన కూతురు మృతికి కారణం పూర్ణచందరే అంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోస్టుమార్టం కోసం స్వేచ్ఛ మృతదేహాన్ని ఇప్పటికే గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం పూర్తి కావడంతో ఆమె మృతదేహాన్ని రాంనగర్‎ పార్సీగుట్టలోని స్వేచ్ఛ నివాసానికి తరలిస్తున్నారు. స్వేచ్ఛ నేత్రాలను ఆమె తల్లిదండ్రులు డొనేట్‌ చేయడానికి ఒప్పుకున్నారు. రాంనగర్‎ పార్సీగుట్టలోని స్మశాన వాటికలో స్వేచ్ఛ అంత్యక్రియలు నిర్వహిస్తారు.

కాగా, స్వేచ్ఛ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు జవహర్‌నగర్‌లోని తన ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమెకు ఓ పాప కూడా ఉంది. భర్తతో విబేధాల కారణంగా విడిపోయింది. ఆ తర్వాతి నుంచి పూర్ణచంద్రతో ఆమె ఉంటున్నట్లు తెలుస్తోంది. అతడితోనూ కొన్నాళ్లుగా విబేధాలు ఉన్నాయని సమాచారం. స్వేచ్ఛ మృతి చెందినప్పటి నుంచి పూర్ణ చందర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.