రెండు రోజులు రూ. 219కోట్ల మద్యం అమ్మకాలు..

Telangana Liquor Sales: తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అని ప్రకటించగానే మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదైనట్లుగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. రూ.219 కోట్ల మద్యం అమ్మకాలు రెండు రోజుల్లోనే జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు.

కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించగా.. మద్యం అమ్మకాలు కూడా ఉండవేమో? అనే భయంతో మందుబాబులు మద్యం కోసం షాపుల ముందు ఎగబడ్డారు. దీంతో నిన్న, ఇవాళ రూ. 219కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లుగా ఎక్సైజ్ శాఖ చెబుతుంది.

నిన్న ఒక్కరోజే రూ.125కోట్ల మద్యం అమ్మకాలు జరగగా.. ఇవాళ రూ. 94కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. మే నెలలో ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.770కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈరోజు ఉదయం 10గంటల నుంచి లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి.

ట్రెండింగ్ వార్తలు