నల్లగొండ జిల్లాలోని కనగల్ మండలంలో అరుదైన ఘటన జరిగింది. లవ్ మ్యారేజీని త్యాగం చేసి ఎరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న మహిళకు అనుకోని ట్విస్ట్ తో ప్రేమ పెళ్లికి పచ్చ జెండా ఊపేశారు పెద్దోళ్లు. రెండ్రోజుల్లో 2 పెళ్లిళ్లు జరగడానికి ముందు పెళ్లిలో వరుడే కారణం.
శాబ్దులాపురానికి చెందిన మౌనిక కుటుంబం కురంపల్లిలో ఉంటున్నారు. వరుసకు మావయ్య అయ్యే రాజేశ్ అనే వ్యక్తిని కొంత కాలంగా ప్రేమిస్తుంది. దీనికి పెద్దలు వ్యతిరేకత చూపించడంతో వారు కుదిర్చిన వివాహం చేసుకోవడానికే సిద్ధమైంది. కొండభీమనపల్లికి చెందిన వరుసకు మామ అయ్యే వ్యక్తితో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి జరిగి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుందనుకన్న సమయంలో వరుడు తీసుకున్న నిర్ణయం ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యేలా చేసింది.
శుక్రవారం మౌనికకు పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. తలొంచుకుని తాళి కట్టించుకున్న మహిళ అప్పగింతల సమయంలో వరుడిని పట్టుకుని ఏడ్చేసింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని గతంలోనే వేరొక వ్యక్తిని ప్రేమించానని చెప్పింది. విషయం తేల్చుకోవాల్సిందేనని వరుడు పంచాయతీ పెట్టించాడు. పోలీసులు, పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన చర్చలో పెళ్లిని రద్దు చేశారు.
ఆ తర్వాత ప్రేమించిన యువకుడిని పిలిపించి రెండో రోజే గుడిలో పెళ్లి ఏర్పాటు చేశారు. ఇరు కుటుంబాల బంధువుల సమక్షంలో ప్రేమికుడితోనే ఆ యువతి పెళ్లి జరిగింది.