Bandi Sanjay KTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇరువురు నేతలు కలిశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. నర్మాల ప్రాజెక్ట్ దగ్గరికి కేటీఆర్ అలానే బండి సంజయ్ వెళ్లడం జరిగింది. వారిద్దరూ ఒక్కసారిగా ఎదురుపడటంతో ఆలింగనం చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.
వారిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. ఒకరు కేంద్ర మంత్రి, మరొకరు మాజీ మంత్రి. ఒకరు బీజేపీ, మరొకరు బీఆర్ఎస్. ఇరువురు నేతల మధ్య రాజకీయంగా వైరం ఉంది. ఇరువురు సై అంటే సై అంటూ మాటల యుద్ధం చేస్తున్నారు. నిత్యం ఏదో అంశంపై ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉంటాయి.
నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్ లో సవాళ్లు విసురుకుంటున్నారు. వారే కేంద్ర మంత్రి బండి సంజయ్, మరొకరు కేటీఆర్. ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్న ఆ నేతల మధ్య అరుదైన దృశ్యం కనిపించింది. ఆ ఇద్దరు కలుసుకున్నారు.
నవ్వుతూ ఒకరినొకరు పలకరించుకున్నారు. అంతేనా.. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, ఆలింగనం కూడా చేసుకున్నారు. నర్మాల ప్రాజెక్ట్ సందర్శన సమయంలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.
ఇరువురు నేతలు ఒకరినొకరు కలిసి పలకరించుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల్లో ఆనందం వెల్లవిరిసింది. బండి సంజయ్, కేటీఆర్ పలకరింపులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణ రాజకీయవర్గాల్లో ఈ సీన్ ఆసక్తికరంగా మారింది.
రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి ఇరువురు నేతలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం, ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడం ఇంట్రస్టింగ్ గా మారింది.
Also Read: బండి సంజయ్ చొరవ.. వరదలో చిక్కుకున్న రైతులను హెలికాప్టర్లలో తీసుకొచ్చిన దృశ్యాలు చూడండి..