×
Ad

ముక్కోటి ఏకాదశి వేళ.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారిని దర్శించుకున్న రేవంత్‌ రెడ్డి

టీటీడీలో గత అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు వైకుంఠ ద్వార తలుపులు తెరిచారు.

Vaikuntha Ekadashi: ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. టీటీడీలో గత అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు వైకుంఠ ద్వార తలుపులు తెరిచారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా నిన్న ఒక్కరోజే దాదాపు 60 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించామని ఆయన తెలిపారు. వీవీఐపీల దర్శనాలు కేవలం 3 గంటల పాటు మాత్రమే ఉంటాయన్నారు.

Also Read: అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ.. పోలీసుల గాలింపు

మూడు రోజుల దర్శనాల కోసం ఆన్‌లైన్ లక్కీ డిప్ ద్వారా దాదాపు 1.89 లక్షల టోకెన్లు జారీ చేసినట్లు చెప్పారు. టీటీడీ రెండంచెల తనిఖీనీ పాటిస్తోంది. నిన్న 18,609 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు.

కాగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు.

వేములవాడ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ద్వారక తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దీపాల కాంతుల్లో భద్రాచలం దేవాలయం వెలిగిపోతోంది.