అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ.. పోలీసుల గాలింపు

గత ఏడాది జూన్ 7న సునీల్‌పై దాడి చేయాలని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారని ఆరోపణలు ఉన్నాయి.

అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ.. పోలీసుల గాలింపు

Vallabhaneni Vamsi

Updated On : December 30, 2025 / 9:07 AM IST

Vallabhaneni Vamsi: వైఎస్సార్‌సీపీ నేత వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయనను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ డిసెంబరు 17న విజయవాడ మాచవరం స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది. ఆయనతో పాటు మరికొందరి పేర్లను పోలీసులు నిందితులుగా నమోదు చేశారు.

గత ఏడాది జూన్ 7న సునీల్‌పై దాడి చేయాలని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే ఆయన అనుచరులు సునీల్‌పై దాడి చేశారని కేసు నమోదైంది. ఈ కేసులో ఇటీవల వల్లభనేని వంశీ ఇంటికి వెళ్లిన పోలీసులు సమన్లు ఇచ్చేందుకు ఇవ్వాలనుకున్నారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు.

Also Read: న్యూ ఇయర్ వేళ.. ఈ పనులు చేశారో అంతే సంగతి

వంశీ అనుచరులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ ఆయనకు ఉపశమనం దక్కలేదు.

వంశీ ఫోన్ కూడా స్విచాఫ్ చేసినట్లు తెలుస్తోంది. వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు, సునీల్‌పై జరిగిన దాడి కేసులో వంశీ అనుచరుడు ఓలుపల్లి రంగా కోర్టు వాయిదాకు హాజరుకాలేదు.