×
Ad

Ajay Devgn Film City: తెలంగాణకు భారీ పెట్టుబడులు.. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో అజయ్ దేవ్‌గణ్ ఫిలిం సిటీ, వంతారా కన్జర్వేటరీ..

రిలయన్స్ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది.

Ajay Devgn Film City: తెలంగాణ రైజింగ్ మిషన్ లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని త్రీ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి దేశ విదేశాల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇందులో భాగంగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి ఫిలిం సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు.

రిలయన్స్ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది. రిలయన్స్ కి చెందిన వంతార యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేటివ్ నైట్ సఫారీ ఏర్పాటు చేయటానికి ముందుకొచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 8, 9న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు, కంపెనీల సీఈవోలు దీనికి హాజరవుతున్నారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఇప్పటికే ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. మొన్న సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లోనూ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గన్ ఫిలిం సిటీ నిర్మించేందుకు ప్రభుత్వంతో గ్లోబల్ సమ్మిట్ లో ఎంవోయూ కుదుర్చుకోబోతున్నారు.

ఇక రిలయన్స్ సైతం భారీగా ఇన్వెస్ట్ చేసుందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే గుజరాత్ లో వంతారా రూపంలో భారీ పెట్టుబడి పెట్టిన రిలయన్స్.. ఇప్పుడు తెలంగాణలోనూ నైట్ సఫారీ ఏర్పాటుకి సంబంధించి ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోబోతోంది. ఈ ఎంవోయూ తెలంగాణ టూరిజానికి భారీ ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.

ఈ కంపెనీ రాక టూరిజానికి బిగ్ బూస్టింగ్ కానుంది. దాంతో పాటు మరో ప్రముఖ కంపెనీ ఫుడ్ లింక్ ఎఫ్ అండ్ బీ హోల్డింగ్స్.. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో 3వేల కోట్ల రూపాయల పెట్టబడులు పెట్టనుంది. మూడు భారీ హోటల్స్ నిర్మాణానికి ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోబోతోంది. ఇవే కాదు.. ఇంకా ప్రపంచ ప్రముఖ కంపెనీలు.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోబోతున్నాయి.

Also Read: గతంలో సీఎం వరంగల్‌కు వెళ్తే పట్టించుకోని దొంతి.. ఇప్పుడేమో..