Donthi Madhava Reddy: గతంలో సీఎం వరంగల్‌కు వెళ్తే పట్టించుకోని దొంతి.. ఇప్పుడేమో..

నిన్నటి మొన్నటి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డితో అంటీముట్టన‌ట్లుగా ఉన్న దొంతి మాధ‌వ రెడ్డి ఆల్ ఆఫ్ స‌డెన్‌గా మారిపోయారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు సీఎంతో వెరీ క్లోజ్‌గా మూవ్ అవుతున్నార‌ట‌ దొంతి.

Donthi Madhava Reddy: గతంలో సీఎం వరంగల్‌కు వెళ్తే పట్టించుకోని దొంతి.. ఇప్పుడేమో..

CM Revanth Reddy, Donthi Madhava Reddy

Updated On : December 1, 2025 / 8:25 PM IST

Donthi Madhava Reddy: సీఎం రేవంత్‌ రెడ్డి రూట్‌ మార్చారు. ఒక‌ప్పుడు త‌న‌ను తీవ్రంగా వ్యతిరేకించిన వారంద‌రినీ ఇప్పుడు తన స‌పోర్టర్స్‌గా మార్చుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో బ‌ల‌మైన నేత‌లంద‌రినీ త‌న లైన్‌లోకి తెచ్చుకుంటున్నారు. లేటెస్ట్‌గా ఆ లిస్ట్‌లోకి ఓ కీల‌క‌ నేత, సిట్టింగ్‌ ఎమ్మెల్యే చేరారు. ఆయనే న‌ర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధ‌వ‌రెడ్డి.

ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో దొంతి మాధ‌వరెడ్డి..రేవంత్‌కు ప్రత్యర్థి వర్గంగా కొనసాగుతూ వచ్చారు. 2014లో కాంగ్రెస్ టికెట్ రాక‌పోవ‌డంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన..ఆ త‌ర్వాత హస్తం పార్టీ అధికారంలోకి రాక‌పోయినా తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ పట్ట ఇంత క‌మిట్‌మెంట్ ఉండ‌టంతో హైకమాండ్‌ కూడా దొంతి విష‌యంలో కాస్త సాఫ్ట్‌ కార్నర్‌తో ఉంటుంది. అలాంటి దొంతి మాధ‌వ‌రెడ్డి మొద‌టి నుంచి కూడా రేవంత్ రెడ్డికి కాస్త దూరంగానే ఉంటూ వ‌చ్చారు.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి ములుగు జిల్లా నుంచి రాష్ట్రవ్యాప్త పాద‌యాత్ర చేపట్టినప్పుడు త‌న నియోజ‌క‌వ‌ర్గంలోకి రాకుండా బ్రేకులు వేశారు. రెండేళ్ల కింద కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో పాటు..దొంతి మాధ‌వ రెడ్డి కూడా మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ పవర్‌లోకి వ‌చ్చి..రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కూడా దొంతి మాధ‌వరెడ్డి అంతే డిస్టాన్స్ మెయింటెన్ చేశారు.

Also Read: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి వారిని గెలిపించొద్దు: రేవంత్‌ రెడ్డి

సీఎంను క‌లిసేందుకు ఆసక్తి చూపలేదు. గ‌తేడాది ఉమ్మడి వరంగల్ జిల్లా స‌మీక్షా స‌మావేశానికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే హాజరైనా..ఆ మీటింగ్‌ వైపు కన్నెత్తి చూడలేదు దొంతి. న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఉండి కూడా రేవంత్‌ రివ్యూ మీటింగ్‌కు డుమ్మా కొట్టారు. అప్పట్లో దొంతి తీరు తెగ చ‌ర్చనీయాంశమైంది.

దొంతి మాధ‌వ రెడ్డి స‌డెన్‌గా ఎలా మారారు?
నిన్నటి మొన్నటి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డితో అంటీముట్టన‌ట్లుగా ఉన్న దొంతి మాధ‌వ రెడ్డి ఆల్ ఆఫ్ స‌డెన్‌గా మారిపోయారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు సీఎంతో వెరీ క్లోజ్‌గా మూవ్ అవుతున్నార‌ట‌ దొంతి. కొన్ని రోజుల క్రితం దొంతి మాధ‌వ‌రెడ్డి త‌ల్లి మృతి చెందగా..సీఎం రేవంత్‌ దొంతికి ఫోన్ చేసి ప‌రామ‌ర్శించ‌డ‌మే కాకుండా.. వ‌రంగ‌ల్‌లో ఏర్పాటు చేసిన ద‌శ‌దిన‌క‌ర్మ కార్యక్రమానికి హాజ‌ర‌య్యారు.

దీంతో అప్పటి వ‌ర‌కు కాస్త గ్యాప్ మెయింటెన్‌ చేసిన దొంతి పాత ముచ్చట ప‌క్కన పెట్టి..సీఎం రేవంత్‌కు క్లోజ్ అయిపోయారట. ఈ మ‌ధ్య సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని త‌న నివాసంలో ప్రత్యేకంగా క‌లిశారట‌ దొంతి. అంతేకాదు గ‌తంలో త‌న నియోజ‌క‌వ‌ర్గంలోకి రావొద్దని అడ్డుకున్న ఆయన..ఇప్పుడు స్వయంగా నర్సంపేటకు రావాలని ఆహ్వానించారట. అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయాల‌ని సీఎంను కోరార‌ట‌. దీంతో సీఎం కూడా దొంతి విజ్ఞప్తికి ఓకే చెప్పార‌ట‌. ప్రజాపాల‌న వారోత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాల ప‌ర్యట‌న‌లు చేస్తున్న సీఎం..వ‌రంగ‌ల్ జిల్లా మీటింగ్‌ను న‌ర్సంపేటలో పెట్టబోతున్నారు.

డిసెంబ‌ర్ 5న న‌ర్సంపేటలో జ‌రిగే బ‌హిరంగ‌స‌భ‌కు సీఎం అటెండ్ కాబోతున్నారు. మీటింగ్ ఏర్పాట్లను స్వయంగా ఎమ్మెల్యే దొంతి మాధ‌వ‌రెడ్డి ప‌ర్యవేక్షిస్తున్నారు. పీసీసీ హోదాలో న‌ర్సంపేటలో పాద‌యాత్ర చేయ‌లేక‌పోయిన రేవంత్ రెడ్డి ..ఇప్పుడు అదే న‌ర్సంపేటలో సీఎం హోదాలో బ‌హిరంగ స‌భ‌కు అటెండ్ కాబోతుండటం కాంగ్రెస్ పార్టీలో చ‌ర్చకు దారితీస్తోంది. పాలిటిక్స్‌లో శాశ్వత మిత్రులు..శాశ్వత శ‌త్రువులు ఉండ‌ర‌న్న సామెతకు దొంతి ఎపిసోడ్ పర్ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌గా చెప్పుకుంటున్నారు. అయితే హస్తం పార్టీలో తన వ్యతిరేక వర్గాన్ని మ‌చ్చిక చేసుకోవ‌డంలో సీఎం రేవంత్ రెడ్డి స‌క్సెస్ అవుతున్నారన్న టాక్ అయితే బలంగా నడుస్తోంది.