Viral Video: రెప్పపాటులో ఈ ఘోర ప్రమాదం నుంచి బయటపడి..

రద్దీ ఎక్కువగా ఉన్న రహదారులపై ఇలాంటి వెర్రి చేష్టలు అత్యంత ప్రమాదకరమని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు.

Viral Video

Viral Video – VC Sajjanar: ఏదో సరదా కోసం స్కిట్లు చేస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.. జాగ్రత్త అంటూ టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ యువకుడు బైకుపై స్టంట్లు చేస్తూ రోడ్డుపై వెళ్తుంటాడు. ఒక్కసారిగా అదుపుతప్పి బైకుతో పాటు కారు కింద పడబోతాడు.

రెప్పపాటులో ఈ ఘోర ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు. ఈ వీడియోనే సజ్జనార్ పోస్ట్ చేశారు. రద్దీ ఎక్కువగా ఉన్న రహదారులపై ఇలాంటి వెర్రి చేష్టలు అత్యంత ప్రమాదకరమని అన్నారు. అందరికీ ఈ మహానుభావుడిలా అదృష్టం ఉండకపోవచ్చని హెచ్చరించారు.

రోడ్డు ప్ర‌మాదాలకు కార‌ణం వాహనదారులు, పాద‌చారుల అజాగ్ర‌త్తే కాదు.. కొందరు యువకులు రోడ్లపై బైకులతో స్టంట్లు కూడా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. స్టంట్లు చేస్తూ త‌మ విలువైన ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా.. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వెళ్తున్న వారి ప్రాణాలకూ ముప్పు తెస్తున్నారు కొందరు యువకులు.

Heavy Rains: హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం