CM KCR National Party
KCR National Party: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఇక నుంచి భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా రూపాంతరం చెందబోతోంది. మరికొద్ది సేపట్లో ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో జాతీయ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా ప్రకటించనున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 1.19 గంటలకు కొత్త పార్టీ పేరును కేసీఆర్ ప్రకటిస్తారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథులుగా కర్ణాటక నుంచి ఆ రాష్ట్ర మాజీ సీఎం హెచ్.డి. కుమారస్వామి, ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొంటారు. అదేవిధంగా తమిళనాడు నుంచి వీసీకే వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎంపీ తిరుమావళవన్ కూడా తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో పాల్గొంటారు.
CM KCR National Party: తెలంగాణ భవన్ వద్ద సందడి.. కుమారస్వామితో కలిసి చేరుకున్న కేసీఆర్
తెలంగాణ భవన్ వేదికగా జరిగే సమావేశంలో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పేరును ప్రకటించనున్నారు. అనంతరం తమిళనాడుకు చెందిన విదుతాలై చిరుతైగల్ కచ్చె(వీసీకే) నూతనంగా ప్రకటించబోయే జాతీయ పార్టీలో విలీనం కానున్నట్లు తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో మార్పుకోరుతూ కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన మరికొన్ని పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో వీసీకే బాటలోనడిచేందుకు మరికొన్ని పార్టీలు సిద్ధమైనట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
CM KCR National Party Effect?: సొంత గూటికి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
తమిళనాడుకు చెందిన వీఆర్ఎస్‌తో పాటు కర్ణాటకకు చెందిన మరో రెండు పార్టీలు, మహారాష్ట్రకు చెందిన ఓ పార్టీ సీఎం కేసీఆర్ ప్రకటించేబోయే జాతీయ పార్టీలో విలీనం అయ్యేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.