VLTD : ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో అన్ని రవాణ వాహనాల్లో వెహికల్ లొకేషన్ ట్రేసింగ్ డివైజ్ లను(వీఎల్టీడీ) తప్పనిసరి చేస్తూ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్, గూడ్స్ వాహనాలకు.. వెహికల్ లొకేషన్ ట్రేసింగ్ డివైజ్ ను తప్పనిసరిగా అమర్చుకోవాలి. ఇందుకోసం అనుమతిని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది.
ఢిల్లీలో నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా సంచలన రేపిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో దారుణం జరిగింది. అదే రీతిలో తెలంగాణలోనూ రెండు మూడు చోట్ల ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ బస్సుల్లో మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వాహనాలకు వెహికల్ లొకేషన్ ట్రేసింగ్ డివైజ్ లను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీటి ద్వారా ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ ఎక్కడున్నా వెంటనే ట్రేస్ చేసే అవకాశం ఉంటుందని భావిస్తోంది.
దీంతో ఏ వాహనంలోనైనా అనుకోని ఘటన జరిగితే క్షణాల్లో సంబంధిత అధికారులతో పాటు పోలీసులను అలర్ట్ చేసి నిందితులను అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. ఖైరతాబాద్ లోని రాష్ట్ర రవాణ శాఖ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. ఇక్కడి నుంచే వీఎల్టీడీ పరికరం అమర్చే ప్రతి వాహనం కదలికలపై నిఘా ఉంచనున్నారు.
Also Read : ఈ పథకంలో 15 ఏళ్లు పెట్టుబడి పెడితే చాలు.. మీ కూతురి పెళ్లినాటికి రూ. 69 లక్షలపైనే చేతికి అందుతాయి..!
ట్రాన్స్ పోర్ట్ వాహనాలకే కాదు గూడ్స్ వాహనాలకు కూడా వీఎల్టీడీలను తప్పనిసరి చేయనున్నారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, గూడ్స్ అవసరాల కోసం వాడే పాత, కొత్త వాహనాలు అన్నింటికీ వీఎల్టీడీలను మస్ట్ చేయనున్నారు. అంతేకాదు.. కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రతి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వెహికల్, గూడ్స్ వాహనాలతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం తిరుగుతున్న అన్ని రకాల వాహనాల్లోనూ వీఎల్టీడీలను అమర్చనున్నారు.
Also Read : టాటా క్రోమా సంచలనం.. ఏసీలు, కూలర్లపై దిమ్మతిరిగే ఆఫర్లు.. 24 గంటల్లోనే డెలివరీ.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!
కేంద్రం నుంచి పర్మిషన్ రాగానే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాహనాల తయారీ కంపెనీలు, గూడ్స్ వాహనాల తయారీ కంపెనీలు.. వీఎల్టీడీలను కొనేలా రవాణశాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. కాగా, ఒక్కో పరికరానికి 8వేల రూపాయల నుంచి 10వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంటున్నారు.
ఒకవేళ ఏదైనా కొత్త వాహనానికి ఈ పరికరాన్ని అమర్చకుంటే.. దానికసలు రిజిస్ట్రేషన్ చేయరు. ఏ వెహికల్ ఓనర్ అయినా.. ఈ డివైజ్ ను బిగించుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. అలాంటి వెహికల్స్ ను సీజ్ చేస్తారు. అంతేకాదు కేసులు కూడా నమోదు చేస్తామని రవాణశాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చారు.
ఈ విధానం అమల్లోకి వస్తే.. రాష్ట్రంలోని ఏ ప్రాంతమైనా, ఏ సమయమైనా రవాణ వాహనాల్లో ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పించడం సాధ్యమవుతుందని అధికారులు అంటున్నారు. కాగా.. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ పబ్లిక్ ట్రాన్స్ పోర్టు, గూడ్స్ వెహికల్స్ కు ఇలాంటి పకడ్బందీ రక్షణ వ్యవస్థ లేదంటున్నారు అధికారులు.
తెలంగాణతోపాటు కర్నాటక, ఒడిశా రాష్ట్రాలు మాత్రమే రవాణ వాహనాలకు వీఎల్టీడీలను తప్పనిసరి చేయడంపై కసరత్తు చేస్తున్నాయి. కేంద్రం నుంచి త్వరలోనే పర్మిషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. అదే జరిగితే ట్రాన్స్ పోర్ట్, గూడ్స్ వెహికల్స్ లకు వీఎల్టీడీలను తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ కానుంది.