×
Ad

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తులకు రేపటి నుంచి దర్శనాలు బంద్.. ఇక ఎల్‌ఈడీ స్ర్కీన్‌లలోనే.. ఎందుకంటే?

రాజన్న ఆలయ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఇవాళ శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి దర్శించుకున్నారు. స్వయంగా స్వామివారికి అభిషేకం, హారతి సమర్పించారు. అనంతరం ఆలయమంతా పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. శృంగేరి పిఠాధిపతి రాకతో భక్తులకు దర్శనం నిలిపివేశారు.

ఇక రేపటి నుంచి ప్రధాన ఆలయంలో భక్తులకు దర్శనం బంద్ అవుతుంది. రేపటి నుంచి నిత్యం కేవలం కైంకర్యపూజలు మాత్రమే ఉంటాయి. స్వామి వారి దర్శనాన్ని ఇక నుంచి ఎల్‌ఈడీ స్ర్కీన్‌లలోనే చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.

Also Read: అందుకే రియాజ్‌పై పోలీసులు కాల్పులు జరిపారు.. కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ.కోటి ఇస్తాం: తెలంగాణ డీజీపీ

రాజన్న ఆలయ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అర్చకులు, వేదపండితుల సూచనలు తీసుకున్నారు. భక్తుల కోసం ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు ఏర్పాటు చేశారు. అయితే, శ్రీ రాజరాజేశ్వరస్వామి మూలవిరాట్టు దర్శనం నిలిపివేయడంతో భక్తుల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. దీంతో మూలవిరాట్టు దర్శనాన్ని ఎల్‌ఈడీ స్క్రీన్‌ ద్వారా కల్పిస్తామని ఇటీవలే దేవాదాయశాఖ ప్రకటన చేసింది.