CM Revanth Reddy Praja Darbar : సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదర్భార్‌పై దివ్యాంగుడు ఏమన్నాడంటే..

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొదటిసారి సీఎం హోదాలు ప్రజా భవన్ కు వెళ్లారు రేవంత్ రెడ్డి. ప్రజాదర్భార్ నిర్వహించారు. ప్రజలతో ముఖా ముఖి మాట్లాడారు.వారి సమస్యలు తెలుసుకున్నారు.

CM Revanth Reddy Praja Darbar

CM Revanth Reddy Praja Darbar : సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొదటిసారి సీఎం హోదాలు ప్రజా భవన్ కు వెళ్లారు రేవంత్ రెడ్డి. ప్రజాదర్భార్ నిర్వహించారు. ప్రజలతో ముఖా ముఖి మాట్లాడారు.వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజాదర్భార్ లో తమ సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీగా తరలివచ్చారు. వీరిలో ఓ దివ్యాంగుడు కూడా ఉన్నాడు. కరెంట్ షాక్ తో రెండు చేతులు, ఒక కాలు కోల్పోయిన బాధితుడు సీఎం రేవంత్ రెడ్డికి తన కష్టం గురించి చెప్పుకుని సహాయం కోరాటానికి వచ్చాడు.

ఈ సందర్భంగా 10టీవీ ప్రతినిధి సదరు బాధితుడు మాట్లాడుతు..తాను మహబూబ్ నగర్ జిల్లా కోయలకొండ మండలం వీరంపల్లి గ్రామం నుంచి వచ్చానని..తన పొలంలోని ట్రాన్స్ ఫారం పేలి తన రెండు చేతులు, ఒక కాలు కోల్పోయానని అప్పటినుంచి తన జీవితం కష్టాలపాలైందని వాపోయాడు. కనీసం తినటానికి కూడా ఇబ్బంది పడుతున్నానని ఎవరైనా పెడితేనే ఆహారం తినాలన్నా..మంచినీళ్లు తాగాలన్నా ఎవరో ఒకరు సహాయం చేయాల్సిన పరిస్థితితో నానా పాట్లు పడుతున్నారని తన కష్టం గురించి సీఎం రేవంత్ రెడ్డికి చెప్పుకున్నానని తెలిపాడు. తనకు అన్నం తినేందుకు సహాయంగా ఆర్టిఫిషియల్ చేతులు పెట్టించాలని కోరానని దానికి సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారని తన కష్టం తీరుస్తానని భరోసా ఇచ్చారని వెల్లడించాడు.

ప్రజాదర్భార్‌లో సమస్య చెప్పుకునేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు.. స్వయంగా పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

తనకు జరిగిన ఈ ప్రమాదంతో తన జీవితం కష్టంగా మారిందనే విషయాన్ని సీఎం కేసీఆర్ కు ఎన్నో సార్లు దరఖాస్తు పెట్టుకున్నానని కేసీఆర్ వద్దకు 90సార్లు తిరిగానని కానీ తనను ఏమాత్రం పట్టించుకోలేదని వాపోయాడు. రేవంత్ రెడ్డి తన బాధను విన్నారని..కష్టాన్ని తీరుస్తానని హామీ ఇచ్చారని వెల్లడించాడు. తన బాధను చాలా ఓపికతో విన్నందుకు చాలా సంతోషంగా ఉందని ..తన కష్టం తీరుతుందని నమ్మకముందని ఆనందం వ్యక్తంచేశాడు.

ట్రెండింగ్ వార్తలు