YS Sharmila Arrested
YS Sharmila Arrested : లోటస్ పాండ్ వద్ద పలు నాటకీయ పరిణామాల మధ్య వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పీఎస్ కు తరలించారు. దీంతో షర్మిల కోసం ఆమెతల్లి విజయమ్మ రంగంలోకి దిగారు. బిడ్డ కోసం బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు వచ్చారు. కుమార్తెను చూడటానికి స్టేషన్ లోపలికి వెళ్లారు. పోలీసులు విజయమ్మను అడ్డుకున్నారు. దీంతో విజయమ్మ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.నా బిడ్డను అన్యాయంగా అరెస్ట్ చేశారు.చూడటానికి వస్తే నన్ను కూడా అడ్డుకుంటున్నారు ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నించారు. ప్రజల కోసం షర్మిల పోరాడుతోందని ప్రజల కోసం పోరాడే గొంతుకను నొక్కేస్తారా?అన్యాయాల గురించి ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు.
విజయమ్మను పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లానికి పోలీసులు అనుమతించకపోవటంతో ఆమె కారులోనే కూర్చున్నారు. నా బిడ్డ వద్దకు నన్ను వెళ్లేంత వరకు ఇక్కడే ఉంటానంటూ విజయమ్మ కారులోనే కూర్చున్నారు. దీంతో పోలీసులు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి శాంతి భద్రతలు దెబ్బతింటాయని సూచించారు.అయినా విజయమ్మ మాత్రం కారులోనే కూర్చున్నారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
YS Sharmila Arrested : పోలీసుల్ని నెట్టేసి .. మహిళా కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించిన షర్మిల
టీఎస్ పీఎస్సీ వివాదంపై సిట్ చీఫ్ ను కలిసేందుకు వెళుతున్న క్రమంలో లోటస్ పాండ్ వద్ద షర్మిల పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు ఆమెపై జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ 350,330 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఓ మహిళా కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించటం, మరో ఎస్సైను తోసేయటం..మరో మహిలా పోలీసును నెట్టేయటం వంటి దరుసు ప్రవర్తనతో షర్మిల హంగామా చేశారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పీఎస్ కు తరలించారు. కుమార్తెను పీఎస్ కు తరలించటంతో ఆమె తల్లి విజయమ్మ పీఎస్ కు వచ్చారు. పోలీసులు ఆమెను షర్మిలను కలవనివ్వకపోవటంతో విజయమ్మ కారులోనే కూర్చున్నారు. ఓపక్క బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం, మరోపక్క బీజేపీ కాంగ్రెస్ ల మధ్య రూ.25 కోట్ల లొల్లి వివాదం, ఇంకోపక్క షర్మిల పోరాటాలు, పాదయాత్రలు బీఆర్ఎస్ పై విమర్శలు,సెటైర్లతో తెలంగాణ రాజకీయాలు పలు ఆసక్తికరంగా మారాయి.
YS Sharmila: నా మీద పడితే నేను భరించాలా? నా రక్షణకోసం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం నా బాధ్యత..