YS Sharmila Arrested : పోలీసుల్ని నెట్టేసి .. మహిళా కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించిన షర్మిల

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పోలీసులపై ఫైర్ అయ్యారు. తనను అడ్డుకుంటున్న పోలీసుల్ని నెట్టివేశారు. డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనించారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

YS Sharmila Arrested  : పోలీసుల్ని నెట్టేసి .. మహిళా కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించిన షర్మిల

YS Sharmila arrested

YS Sharmila arrested : వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పోలీసులను నెట్టివేశారు. డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించారు. టీఎస్ పీఎస్సీ కార్యాలయానికి వెళ్లకుండా షర్మిల ఇంటినుంచి బయటకు రాకుండా భారీగా మోహరించిన పోలీసులు షర్మిలను  అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసులను నెట్టుకుంటు ముందుకెళ్లారు. ఆక్రమంలో కొంతమంది మహిళా కానిస్టేబుల్స్ ఆమెను చుట్టుముట్టారు. ముందుకెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో షర్మిల పట్టరాని ఆగ్రహంతో డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించారు. ఇటువంటి పరిస్థితుల మధ్య లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు షర్మిలకు జరిగిన వాగ్వాదంలో ఆమె పలుమార్లు పోలీసుల్ని నెట్టివేశారు.

మహిళా పోలీసులు షర్మిలను రౌండప్ చేసి అడ్డుకునేందుకు యత్నించినా ఆమె ఏమాత్రం ఆగలేదు..రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ తనను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను షర్మిల పక్కకు తోసేశారు. వారిని వదిలించుకుని నెట్టుకుంటు ముందుకెళ్లి కారు ఎక్కారు. పోలీసులు ఆమె కారుకు అడ్డంగా నిలబడ్డారు. కోపంతో కారుదిగిన షర్మిల పోలీసుల్ని నెట్టేయటం..దురుసుగా ప్రవర్తిస్తూ హంగామా చేశారు. పోలీసులు తనను ముందుకు కదలనీయకపోవటంతో షర్మి అక్కడే రోడ్డుమీదనే బైఠాయించారు.

ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  నా పనులు చేసుకోకుండా అడ్డుకునే అధికారం మీకెక్కడిది? అంటూ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు విధి నిర్వహణలో ఉన్న మహిళ కానిస్టేబుల్ చంప చెళ్లుమనిపించారు షర్మిల. దీంతో పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేయనున్నట్లుగా తెలుస్తోంది.