Vinayaka Chavithi 2025
Ganesh Chaturthi 2025: వినాయక చవితి వచ్చేసింది. హిందువుల ప్రధాన పండుగల్లో ఇది ఒకటి. ఈ పండుగను భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి రోజున జరుపుకుంటారు. విఘ్నేశ్వరుడు, విఘ్నాలను తొలగించి, విద్య, ఐశ్వర్యం, సౌభాగ్యం ప్రసాదించే దేవుడిగా హిందువులు భావిస్తారు.
గణపతికి ప్రత్యేక పూజలు చేసి, ఉండ్రాళ్లు, పాయసం వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. ప్రతి ఇంట్లోనే కాకుండా వీధి వీధిలో పెద్ద పెద్ద విగ్రహాలను ప్రతిష్ఠించి, భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. భజనలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ పండుగ సమైక్యతకు, భక్తికి, ఆనందానికి ప్రతీక. (Ganesh Chaturthi 2025)
గణేశుడి విగ్రహం ముందు కొన్ని మంత్రాలు చదివితే మంచిదని పండితులు చెబుతారు. వినాయక చవితి రోజున పూజలతో రాహు, కేతువుల వల్ల కలిగే సమస్యల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా గందరగోళం, పనులు వాయిదా వేయడం, ఆటంకాలు కలగడం వంటి ఇబ్బందులు రావు. (Vinayaka Chavithi 2025)
ఈ మంత్రాలను 108 సార్ల చొప్పున జపించాలి..
వీటిని ఈ 10 రోజుల పాటు ఉదయం, సాయంత్రం జపించాలి.
Also Read: తల నుంచి పాదం వరకు.. గణేశుడి విగ్రహాన్ని కొనేముందు ఈ రూపాలని చూసి, కొనాల్సిందే.. లేదంటే..
మేషం, తుల రాశుల వారు పూజలు, ధ్యానం చేయాలి. వృషభం, వృశ్చిక రాశుల వారు వినాయకుడిని పూజించాలి. మిథున, ధనుస్సు రాశి వారు ధ్యానం చేయాలి. మకరం, కర్కాటక రాశుల వారి కుటుంబ జీవితంలో మార్పులు వస్తాయి. సింహం, కుంభ రాశుల వారి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీనం, కన్య రాశుల వారు మంత్ర జపం చేయడం వల్ల లైఫ్‌లో సమతుల్యత వస్తుంది.