Madhavi Latha
హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ సెక్యూరిటీ కల్పించింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై ఆమె పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. వీఐపీ సెక్యూరిటీలో భాగంగా 11 మంది సిబ్బంది మాధవీలతకు సర్కారు భద్రత కల్పించింది.
ఆరుగురు సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ అధికారులు ఆమె వెంట ఉంటారు. అలాగే, మరో ఐదుగురు గార్డులు ఆమె నివాసం వద్ద భద్రతగా ఉండనున్నారు. ఆమెకు సెక్యూరిటీ కల్పించడం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. తనకు సెక్యూరిటీ కల్పించాలని ఇప్పటికే పలుసార్లు కేంద్ర హోంశాఖకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖలు రాశారు.
అలాగే, బండి సంజయ్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనకు కేంద్ర బలగాల భద్రతా అవసరమని బీజేపీ నేతలు అన్నారు. వారిద్దరికీ భద్రత కల్పించని కేంద్ర సర్కారు ఇప్పుడు మాధవిలతకు భద్రత కల్పించడంతో బీజేపీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
Also Read: ప్రతి ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు ఇలా చేస్తారు: సజ్జల