ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అంతరించి.. ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించాలని కోరుతూ పూజలు నిర్వహిస్తున్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి. రాబోవు శార్వరి నామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని… ఈ కరోనా అంతరించాలంటూ పరిపూర్ణ మంగళ శాసనములతో మంగళవారం నాడు పూజ నిర్వహిస్తున్నారు.
వికారి నామ సంవత్సరం చివరి రోజు కావడంతో సమాజ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎవరి ఇళ్లలో వాళ్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయాలన్నారు చిన్నజీయర్ స్వామి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని దివ్యధామంలో ఆయన భక్తులతో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ చేయించారు.