Caste Boycott : వీఆర్‌ఏ కుటుంబం కుల బహిష్కరణ..బతుకమ్మ కూడా ఆడనివ్వకుండా..

జనగామ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. వీఆర్‌ఏ కుటుంబాన్ని కులపెద్దలు కుల బహిష్కణ చేశారు. అబ్బయ్య కుటుంబానికి వీఆర్‌ఏ పదవి రావడంతో కులానికి రూ.3 లక్షలు కట్టాలంటూ డిమాండ్ చేశారు.

Caste Boycott

VRA family Caste boycott : జనగామ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. దేవరుప్పలలో వీఆర్‌ఏ కుటుంబాన్ని కుల పెద్దలు కులం నుంచి బహిష్కరించారు. అబ్బయ్య కుటుంబానికి వీఆర్‌ఏ పదవి రావడంతో.. కులానికి మూడు లక్షల రూపాయలు కట్టాలంటూ కుల పెద్దలు డిమాండ్‌ చేశారు.

అంత డబ్బులు కట్టలేమని అబ్బయ్య కుటుంబం చెప్పడంతో అప్పటి నుంచి వారిని కులం నుంచి వేరుగా చూస్తున్నారు. నిన్న బతుకమ్మ పండుగ సందర్భంగా కూడా.. అబ్బయ్య కుటుంబ సభ్యులను మహిళలు, కులపెద్దలు వేరు చేసి చూశారు. దీంతో డబ్బులు కట్టలేదనే కోపంతోనే తమను ఇబ్బంది పెడుతున్నారని అబ్బయ్య కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

Supreme Court : పాముతో కాటు వేయించి హత్య చేయడం కొత్త ట్రెండ్‌గా మారింది : సుప్రీంకోర్టు

బతుకమ్మలు తీసుకుని వెళ్తే అవమానిస్తున్నారని చెప్పారు. వారితో కలిసి బతుకమ్మలు పెట్టనివ్వడంలేదన్నారు. బతుకమ్మను తీసుకెళ్లి కులం, పాలివాళ్లుల్లో పెడితే వేరు చేసి, తనను ఒంటిరి చేశారని పేర్కొన్నారు. బోనాల కూడా అలాగే అవమానిస్తున్నారని వాపోయారు. ప్రతి విషయంలోనూ తన కుటుంబాన్ని చిన్నతనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కమిటీ హాల్ దగ్గర తాను మాట్లాడుతుంటే అడ్డు తగిలి మాట్లాడటానికి అధికారం లేదంటున్నారని పేర్కొన్నారు. కులం నుంచి వెలి వేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. దీంతో పిల్లలు, తనకు చిన్నతనంగా ఉందని బాధ పడ్డారు. తన పాలివాళ్లు, కులం వారు ఒక్కటయ్యారని పేర్కొన్నారు. రాత్రి తన కొడుకు, కూతురిని కొట్టేందుకు వచ్చారని తెలిపారు.