MGM Covid Hospital : పూర్తిస్థాయి కొవిడ్‌ ఆస్పత్రిగా వరంగల్‌ ఎంజీఎం

ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ హాస్పిటల్ గా మారుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

MGM converted covid Hospital : ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ హాస్పిటల్ గా మారుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రిగా ఎంజీఎం మారనుంది. వారం రోజుల్లోనే పూర్తి స్థాయి కోవిడ్‌ ఆస్పత్రిగా ఎంజీఎంను మార్చనున్నారు. ఇక్కడున్న రోగులను ఇతర ఆస్పత్రులకు షిప్ట్‌ చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చినందున వెంటనే ఇక్కడ అవసరమైన వైద్య సిబ్బంది నియామకం చేపడతామని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

1250 బెడ్లతో కరోనా ఆస్పత్రిగా ఏర్పాటు చేశారు. సాధారణ రోగులను ఇతర ఆస్పత్రులకు షిఫ్ట్‌ చేశారు. వరంగల్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బెడ్లు దొరక్క రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కరోజే ఎంజీఎంలో 20 మంది మృతి చెందారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎంజీఎంలో 250 ఆక్సిజన్‌ బెడ్లను అందుబాటులోకి తెచ్చింది. ఆక్సిజన్‌, అత్యవసర మందులు కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.

కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ గా ఆస్పత్రిగా మార్చారు. గాంధీకి ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు వస్తుండటంతో కోవిడ్ ఆస్పత్రిగా మార్చారు. నాన్ కోవిడ్ సేవలను నిలిపివేశారు. రాష్ట్రంలోకెల్ల జీహెచ్ఎంసీలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. హైదరాబాద్ తర్వాత వరంగల్ లోనే అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు