Hyderabad Water : గ్రేటర్‌ హైదరాబాద్ వాసులకు అలర్ట్… నీటి సరఫరాకు అంతరాయం, ఈ ప్రాంతాల్లో నీళ్లు రావు

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సోమవారం(జూలై 5,2021) పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు జలమండలి అధికారులు తెలిపారు.

Hyderabad Water : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సోమవారం(జూలై 5,2021) పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు జలమండలి అధికారులు తెలిపారు. కృష్ణా ఫేజ్‌-2లో భాగంగా నాగోలు జంక్షన్‌ దగ్గర పైప్‌లైన్‌కు రిపేర్లు చేస్తున్నారు. దీంతో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు..
బాలాపూర్‌, మైసారం, బార్కాస్‌ రిజర్వాయర్‌, మేకలమండి, భోలక్‌పూర్‌ రిజర్వాయర్‌, తార్నాక, లాలాపేట్‌, బౌద్ధనగర్‌, మారేడ్‌పల్లి, కంట్రోల్‌ రూమ్‌, రైల్వేస్‌, ఎమ్‌ఈఎస్‌, కంటోన్మెంట్‌, ప్రకాష్‌ నగర్‌, పాటిగడ్డ రిజర్వాయర్‌, హస్మత్‌ పేట్‌, ఫిరోజ్‌గూడ, గౌతమ్‌నగర్‌ రిజర్వాయర్‌, వైశాలినగర్‌, బీఎన్‌రెడ్డి నగర్‌, వనస్థలిపురం, ఆటోనగర్‌, మారుతీనగర్‌ రిజర్వాయర్‌, మహేంద్ర హిల్స్‌ రిజర్వాయర్‌, మహేంద్ర హిల్స్‌ రిజిర్వాయర్‌, ఏలుగుట్ట, రామంతాపూర్‌, ఉప్పల్‌, నాచారం, హబ్సిగూడ, చిలుకానగర్‌, బీరప్పగూడ రిజర్వాయర్‌, మీర్‌పేట్‌, బడంగ్‌పేట్‌, బోడుప్పల్‌లోని కొన్ని ప్రాంతాలకు సోమవారం నీటి సరఫరా ఉండదని జలమండలి అధికారులు తెలిపారు.

ఈ ప్రాంతాల ప్రజలు జాగ్రత్త పడాలని జలమండలి అధికారులు సూచించారు. నీటిని వృథా చేయకుండా, ఉన్న నీటిని పారబోయకుండా నిల్వ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలని నీటిని పొదుపుగా వాడుకోవాలని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు