Water Supply Shutdown: 9, 10 తేదీల్లో హైదరాబాద్‌లో వాటర్ సరఫరా బంద్.. ఏఏ ప్రాంతాల్లో అంటే ..

దక్షిణ మధ్య రైల్వే నిర్మిస్తున్న రైల్వే లైన్ నిర్మాణానికి ఆటంకం ఏర్పడకుండా కుకునూర్ పల్లి వద్ద భారీ పైపులైన్‌ను పక్కకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ పనులు కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాను బంద్ చేయటం జరుగుతుందని అధికారులు తెలిపారు.

Water Supply Shutdown

Water Supply Shutdown: ఈనెల 9, 10 తేదీల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాటర్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది. సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి వద్ద జరుగుతున్న గోదావరి తాగునీటి పైపులైన్ తరలింపు పనులు 8, 9, 10 తేదీల్లో నిర్వహించేందుకు తొలుత ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే 8న హోలీ కారణంగా పనులు వాయిదా పడటంతో 9, 10 తేదీల్లో పనులు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఈ రెండు రోజులు నీటి సరఫరా బంద్ ఉంటుందని జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది.

Watermelon : వేసవిలో మీ శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడే పుచ్చకాయ !

దక్షిణ మధ్య రైల్వే నిర్మిస్తున్న రైల్వే లైన్ నిర్మాణానికి ఆటంకం ఏర్పడకుండా కుకునూర్ పల్లి వద్ద భారీ పైపులైన్‌ను పక్కకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ పనులు కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాను బంద్ చేయటం జరుగుతుందని అధికారులు తెలిపారు. కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, అల్వాల్, బొల్లారం, కొంపల్లి, ఉప్పల్, ఎస్ఆర్ నగర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, నిజాంపేట డివిజన్ల పరిధిలోని 9వ తేదీ ఉదయం 6గంటల నుంచి 48గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు.

Jeera Water : ఒక గ్లాసు జీరా నీళ్లతో ఎన్నో ప్రయోజనాలు!

పైనపేర్కొన్న ఆయా ప్రాంతాల్లో 10వ తేదీ అర్థరాత్రి తర్వాత నీటి సరఫరా ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఆయా డివిజన్లలోని ప్రజలు నీటి సరఫరా అంతరాయానికి సహకరించాలని జలమండలి అధికారులు కోరారు. ఇదిలాఉంటే, నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాల్లో నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి తాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఓఅండ్‌ఎం డివిజన్ల జనరల్ మేనేజర్లను వాటర్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఎం. దానకిషోర్ ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో 24 గంటలూ ట్యాంకర్‌ సరఫరా జరిగేలా జనరల్‌ మేనేజర్లు చర్యలు తీసుకోవాలన్నారు.