Watermelon : వేసవిలో మీ శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడే పుచ్చకాయ !

వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల డీహైడ్రేషన్ నివారించబడుతుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతేకాకుండా వేసవిలో పుచ్చకాయ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. మూత్రపిండాలను ఆరోగ్యం ఉంచడంలో ఇది ఎంతో సహాయపడుతుంది.

Watermelon : వేసవిలో మీ శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడే పుచ్చకాయ !

Watermelon :

Watermelon : వేసవిలో పుచ్చకాయ తినడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. తక్కువ ధరలో, రుచికరంగా ఉండే పుచ్చకాయలో శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు ఉంటాయి. వేసవిలో మన శరీరం ఎక్కువగా డీహైడ్రేషన్ కు గురవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎక్కువగా పుచ్చకాయ తినమని నిపుణులు సలహా ఇస్తూ ఉంటారు.

పుచ్చకాయలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది మన బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తుంది. పుచ్చకాయలో విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎన్నో రకాల వ్యాధుల రాకుండా చూస్తుంది. వేసవిలో పుచ్చకాయను తీసుకోవటం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1. పుచ్చకాయలో కేలరీలు చాలా తక్కువ. కాబట్టి పుచ్చకాయ శరీర బరువును తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది. కడుపుని త్వరగా నింపుతుంది. జీర్ణక్రియకు కూడా మంచిది. బరువు తగ్గడంలో సహాయపడే అద్భుతమైన పండు.

READ ALSO : Summer Skin Care : వేసవి ఎండలతో ముఖం పై చెమటలు, జిడ్డు సమస్యతో బాధపడుతుంటే ?

2. పుచ్చకాయ తినడం వల్ల శరీరీం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. పుచ్చకాయలో వాటర్ కంటెంట్ తోపాటు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తిన్న వెంటనే కడుపు నిండినట్లు అనిపిస్తుంది, తర్వాత ఆకలి వేయదు.

3. వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల డీహైడ్రేషన్ నివారించబడుతుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతేకాకుండా వేసవిలో పుచ్చకాయ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. మూత్రపిండాలను ఆరోగ్యం ఉంచడంలో ఇది ఎంతో సహాయపడుతుంది.

4. కండరాల నొప్పిని తగ్గిస్తుంది, బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. పుచ్చకాయలో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. చర్మానికి నిగారింపు ఇవ్వడంలో పుచ్చకాయ అద్భుతంగా పనిచేస్తుంది.

READ ALSO : Sapota Fruits : వేసవి కాలంలో రోజుకు రెండు సపోటా పండ్లు తింటే చాలు…మంచి ఆరోగ్యం మీ సొంతం!

5. పుచ్చకాయను తింటే అందులోని లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల గుండె చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఎ. ఇవి కొల్లాజెన్ నిర్మాణాన్ని పెంచి మిమ్మల్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుతాయి.