Summer Skin Care : వేసవి ఎండలతో ముఖం పై చెమటలు, జిడ్డు సమస్యతో బాధపడుతుంటే ?

ఐస్ క్యూబ్స్ ను ఉపయోగటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. గుప్పెడు ఐస్ క్యూబ్స్ తీసుకుని, శుభ్రమైన వస్త్రంలో ఐస్ క్యూబ్స్ పెట్టి, చుట్టాలి. తర్వాత ముఖం మీద రుద్దుకోవాలి. ఈ పద్దతిని తరచూ అనుసరిస్తుంటే ఎఫెక్టివ్ గా ముఖంపై చెమటలను నివారించుకోవచ్చు.

Summer Skin Care : వేసవి ఎండలతో ముఖం పై చెమటలు, జిడ్డు సమస్యతో బాధపడుతుంటే ?

Summer skin care

Summer Skin Care : వేసవి వచ్చేసింది. ఎండలు రోజురోజుకు పెరుగుతూ ఇబ్బందికలిగిస్తున్నాయ్. ఎండవేడి కారణంగా పట్టే చెమటలు చాలా మందిని చీకాకు కలిగిస్తాయి. అరచేతుల్లో చెమటలు, కాళ్లలో చెమటలు, ముఖంలో చెమటలు, ఇలా శరీరం మొత్తం చెమటతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. వేసవి కాలంలో ఎన్ని సార్లు స్నానం చేసినా , ముఖాన్ని వాష్ చేసుకున్నా ముఖంలో ఫ్రెష్ నెస్ కనిపించదు. వేసవిలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య ఇది.

వేసవిలో ముఖంలో చెమటలు పడితే చర్మం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎక్కువ చెమటలు పట్టడం వల్ల చర్మం జిడ్డుగా, ఆయిలీగా కనబడుతుంది. ఎంత మేకప్ వేసుకున్నా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. వేసవిలో చెమటలు తగ్గించుకోవడం అంత సులభం కాకపోయినప్పటికీ ఇంట్లో ఉండే కొన్ని హోం రెమెడీస్ తో ఈ సమస్యను దూరం చేయవచ్చు. ఈ చిట్కాలను డైలీ స్కిన్ కేర్ లో ఉపయోగించడం కూడా చాలా మంచిది. వీటిని రెగ్యులర్ గా కొద్దిరోజులు ఉపయోగిస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది . వేసవి సీజన్ లో ముఖంలో చెమటలు పట్టకుండా సహాయపడే కొన్ని ఫేషియల్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Bloating And Gas : వేసవిలో ఈ ఆహారాలు తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు తెలుసా ?

చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి : రోజులో రెండు మూడు సార్లు చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం రంధ్రాల నుండి ఎక్కువ చెమట పట్టకుండా ఉంటుంది. సమ్మర్ సీజన్ లో కోల్డ్ వాటర్ ఎక్కువగా ఉపయోగించి ముఖం శుభ్రపరుచుకోవడం వల్ల నేచురల్ గా హీట్ తగ్గించుకోవచ్చు. ఫేషియల్ స్వెట్టింగ్ కూడా తగ్గించుకోవచ్చు .

ఆయిల్ తో కూడిన స్కిన్ ప్రొడక్ట్స్ కు దూరంగా : ఆయిల్ బేస్డ్ క్రీమ్స్, ప్యాక్స్, మేకప్ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి. ఈ స్కిన్ ప్రొడక్ట్స్ వల్ల చర్మ రంద్రాలు పూడిపోతాయి. దీనివల్ల ఆ ప్రదేశంలో మురికి చేరుతుంది. చెమట ఎక్కువ అవుతుంది. అందువల్ల ఆయిల్ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండటం మంచిది.

చెమటను గ్రహించే టాల్కమ్ పౌడర్ ; టాల్కమ్ పౌడర్ టాల్కమ్ పౌడర్ త్వరగా చెమటను గ్రహిస్తుంది. అదనపు చెమటను దూరం చేస్తుంది. ఇంటి నుండి బయట వెళ్లడానికి ముందుగా కొద్దిగా టాల్కమ్ పౌడర్ ను ముఖం, మెడ, గొంతు భాగంలో అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వేసవిలో అధిక చెమట, అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు.

కుకుంబర్ జ్యూస్ ; రాత్రి నిద్రించడానికి ముందు కీరదోసకాయ రసాన్ని ముఖానికి అప్లై చేస్తే అధిక చెమట సమస్యను తగ్గించుకోవచ్చు. వేసవి సీజన్ లో రాత్రుల్లో ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే అదనపు చెమట నుండి ఉపశమనం పొందవచ్చు

READ ALSO : Sapota Fruits : వేసవి కాలంలో రోజుకు రెండు సపోటా పండ్లు తింటే చాలు…మంచి ఆరోగ్యం మీ సొంతం!

ఐస్ క్యూబ్స్ తో ముఖానికి చెమటలు పట్టకుండా నివారించుకోవచ్చు ; ఐస్ క్యూబ్స్ ను ఉపయోగటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. గుప్పెడు ఐస్ క్యూబ్స్ తీసుకుని, శుభ్రమైన వస్త్రంలో ఐస్ క్యూబ్స్ పెట్టి, చుట్టాలి. తర్వాత ముఖం మీద రుద్దుకోవాలి. ఈ పద్దతిని తరచూ అనుసరిస్తుంటే ఎఫెక్టివ్ గా ముఖంపై చెమటలను నివారించుకోవచ్చు.

యాపిల్ సైడర్ వెనిగర్ ; యాపిల్ సైడర్ వెనిగర్ లో ఆల్కలైన్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది మిరాకిల్ బెనిఫిట్స్ ను అందిస్తుంది. ముఖ్యంగా వేసవి సీజన్ లో ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మం పై అప్లై చేయడం వల్ల చర్మ రంద్రాలు శుభ్రపడుతాయి. స్కిన్ సమస్యలను నివారించుకోవచ్చు .

మేకప్ పదార్థాలను తక్కువగా ఉపయోగించాలి ; వేసవి సీజన్ లో ఎక్కువగా మేకప్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం, మేకప్ వేసుకుని ఎండలో తిరగడం , రాత్రుల్లో మేకప్ తొలగించుకుండా నిద్రించడం వంటి పనులు చేయడం వల్ల చెమటలు మరింత ఎక్కువ అవుతాయి. చెమటలతో పాటు, స్కిన్ సమస్యలు కూడా అధికమవుతాయి. వేసవి సీజన్ లో మేకప్ వేసుకోకపోవడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.