Gattu Ramachandra Rao : వైఎస్ షర్మిలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. ‘బండి కాంగ్రెస్ ది.. డ్రైవర్ టీడీపీ’ : గట్టు రామచంద్రరావు

కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ అని ఆయన అభివర్ణించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ కి దగ్గర అవుతుందనే భయం రేవంత్ కి ఉందని తెలిపారు.

Gattu Ramachandra Rao

Gattu Ramachandra Fire Revanth : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై వైఎస్సార్ టీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు ఫైర్ అయ్యారు. వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి సొంత పార్టీలోనే అభద్రతా భావం ఉందన్నారు. ‘బండి కాంగ్రెస్ ది.. డ్రైవర్ టీడీపీ’ అని ఎద్దేవా చేశారు.

రేవంత్ న్యాయకత్వంపై సొంత పార్టీలోనే అసహనం ఉందన్నారు. కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ అని ఆయన అభివర్ణించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ కి దగ్గర అవుతుందనే భయం రేవంత్ కి ఉందని తెలిపారు. కాంగ్రెస్ తో పొత్తు అంశంపై తాము ఇప్పటివరకు ప్రకటన చేయలేదన్నారు. ఇప్పటికిప్పుడు పొత్తులపై మాట్లాడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

Sajjala Ramakrishna Reddy : అందుకే.. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళారు : సజ్జల రామకృష్ణారెడ్డి

ఎక్కడైనా కోడలు వారసురాలు అవుతారని వెల్లడించారు. ఎక్కడి నుంచో వచ్చిన సోనియా గాంధీ ఈ దేశానికి వారసురాలు అయ్యిందన్నారు. సోనియా గాంధీ వారసురాలు అయినప్పుడు వైఎస్ షర్మిల తెలంగాణకి వారసురాలు ఎందుకు కారు అని ప్రశ్నించారు. ఈ దేశాన్ని పాలించే హక్కు ఇటలీ వాళ్లకు లేదని తాము అంటే ఎలా ఉంటుందన్నారు.

‘మీరు సోనియా గాంధీని విమర్శించలేక మాతో విమర్శ చేయించాలని అనుకుంటున్నారా? అని రేవంత్ ను నిలదీశారు. తెలంగాణలో ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ వైఎస్సార్ టీపీ అని స్పష్టం చేశారు. ‘మీలో ఉన్న అభద్రతా భావాన్ని మాపై వేసి రుద్దకు’ అని రేవంత్ ను ఉద్దేశించి గట్టు రామచంద్ర రావు వ్యాఖ్యానించారు.