MLA Raja Singh : అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నాం.. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా ఉంటే ప్రమాణం చేయం : ఎమ్మెల్యే రాజసింగ్

ఎంఐఎంకు భయపడే అక్బరుద్దీన్ కు సీఎం రేవంత్ రెడ్డి ప్రొటెం స్పీకర్ గా అవకాశమిచ్చారని ఆరోపించారు.

MLA Raja Singh

MLA Raja Singh Boycott Assembly Sessions : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బీజేపీ బహిష్కరించింది. శనివారం నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ప్రకటించారు. కాసీం రిజ్వీ వారసుడు అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా ఉంటే తాము ప్రమాణ స్వీకారం చేయబోమని స్పష్టం చేశారు. తనతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.

15నిమిషాల టైం ఇస్తే హిందువులను లేకుండా చేస్తానన్న అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ఎంఐఎంకు భయపడే అక్బరుద్దీన్ కు సీఎం రేవంత్ రెడ్డి ప్రొటెం స్పీకర్ గా అవకాశమిచ్చారని ఆరోపించారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ నెత్తి ఎక్కి కూర్చున్న చరిత్ర ఎంఐఎంది అని విమర్శించారు.

Telangana Police : తెలంగాణ ఉద్యమ కేసుల ఎత్తివేతకు పోలీస్ శాఖ నిర్ణయం

అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని నియమించారు. రేపు (శనివారం) ఉదయం11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. రేపు (శనివారం) ఉదయం 8.30 గంటలకు రాజ్ భవన్ లో ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అక్బరుద్దిన్ ఓవైసీ చేత గవర్నర్ తమిలి సై ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

అక్బరుద్దిన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో రేపటి నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ప్రకటించారు. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా ఉంటే తాము ప్రమాణ స్వీకారం చేయబోమని తేల్చి చెప్పారు.

 

ట్రెండింగ్ వార్తలు