Telangana Police : తెలంగాణ ఉద్యమ కేసుల ఎత్తివేతకు పోలీస్ శాఖ నిర్ణయం
2009 మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి 2014 జూన్ 2వ తేదీ వరకు నమోదైన అన్ని కేసుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

TS POLICE
Telangana Police Department Key Decision : తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమ కేసుల ఎత్తివేయాలని నిర్ణయించింది. 2014 జూన్ 2వ తేదీ వరకు తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసుల వివరాలు అందజేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లను తెలంగాణ డీజీపీ ఆదేశించారు. 2009 మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి 2014 జూన్ 2వ తేదీ వరకు నమోదైన అన్ని కేసుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే తెలంగాణ ఉద్యమకారుల కేసులను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేయనుంది.