తెలంగాణలో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ

4 రోజులపాటు తెలంగాణలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.

weather forecast for telangana

Weather Forecast for Telangana: నేటి నుంచి 4 రోజులపాటు తెలంగాణలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు వాతావరణశాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

నిజామాబాద్ జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం
అకాల వర్షాల కారణంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. శనివారం రాత్రి నుంచి కురిసిన వడగళ్ల వర్షంతో వరి, గోధుమ, ఉల్లి, జొన్న, పొగాకు, నువ్వులు, కూరగాయల పంటలు నాశనమయ్యాయి. మామిడి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 26,129 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు.

Also Read: ఎమ్మెల్సీ కవితపై ప్రశ్నల వర్షం.. తొలిరోజు ముగిసిన ఈడీ కస్టడీ, ఏమేం అడిగారంటే..