తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది. పలు చోట్ల చినుకులు పడుతున్నాయి. 

Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇవాళ్టి నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ కురిసి అవకాశం ఉంది.

రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి. మీ.)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది. పలు చోట్ల చినుకులు పడుతున్నాయి.

Also Read : ఖరీఫ్ ప్రొద్దుతిరుగుడు రకాలు.. సాగు మెళకువలు