తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో తగ్గుదల

Weather Update: కొన్ని ప్రాంతాల్లో నేటి నుంచి ఆదివారం వరకు ఉరుములు, మెరుపులతో పాటు...

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో తగ్గుదల కనపడుతుందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ఒకటి మరాత్వాడ, పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని తెలిపింది.

ద్రోణి/గాలి విచ్చిన్నతి ఒకటి మరాత్వాడ నుంచి, కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతోందని చెప్పింది. నిన్న కోమరిన్ ప్రాంతం నుంచి తమిళనాడు, రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగిన ద్రోణి ఈరోజు బలహీనపడిందని తెలిపింది.

ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడ అక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని చెప్పింది. అలాగే, కొన్ని ప్రాంతాల్లో నేటి నుంచి ఆదివారం వరకు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మొస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Also Read: హైదరాబాద్‌లో మే 8న ఐపీఎల్ మ్యాచ్.. పేటీఎంలో టికెట్ బుకింగ్స్ ఓపెన్

ట్రెండింగ్ వార్తలు